బిజెపి నేతల సమక్షంలో కాషాయ కండువా
ఉద్యమద్రోహులకు కెసిఆర్ పెద్దపీట వేశారన్న బండి
న్యూఢల్లీి,డిసెంబర్6 (జనంసాక్షి); తెలంగాణ ఉద్యమకారుడు సిహెచ్ విఠల్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. సోమవారం ఢల్లీిలోని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్సాస్ నఖ్వీ, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ విఠల్ బీజేపీలో చేరడాన్ని స్వాగతిస్తున్నానన్నారు. ఉద్యమకారులపై సీఎం కేసీఆర్ వైఖరికి నిరసనగా ఈ చేరికలు జరుగు తున్నాయన్నారు. ఉద్యమ ద్రోహులకు టీఆర్‌ఎస్ పార్టీలో ముఖ్యమంత్రి పెద్దపీట వేస్తున్నారని విమర్శిం చారు. తెలంగాణలో నిజమైన ఉద్యమకారులు తెలంగాణలో బీజేపీ చేస్తున్న పోరాటానికి కలసి రావాలని పిలుపునిచ్చారు. తీన్మార్ మల్లన్న మంగళవారం బీజేపీలో చేరుతారని బండిసంజయ్ తెలిపారు. విఠల్ మాట్లాడుతూ ఈ రోజు జీవితంలో మరపురానిరోజని, అంబేద్కర్ జయంతి, రామమందిర నిర్మాణం కోసం కరసేవకులు బలిదానం చేసిన రోజున సొంత ఇల్లు బీజేపీకి రావడం సంతోషంగా ఉందన్నారు. రెండు లక్షల ఉద్యోగాలు తెలంగాణలో ఖాళీగా ఉన్నా.. ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ చేయడంలేదని ఆరోపించారు. టీఆర్‌ఎస్ పార్టీలో ఉద్యమకారులకు, మహిళలు, విద్యావంతులకు సరిjైున గౌరవం లేదన్నారు. 7 ఏళ్ళలో 600 మంది ఆత్మబలిదానాలు చేసుకున్నారన్నారు. 2023లో తెలంగాణ బీజేపీ అధికారంలోకి వస్తుందని విఠల్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ దేశంకోసం చేస్తున్న కృషితో పాటు అనేక అభివృద్ది కార్యక్రమాలు కూడా తెలంగాణలో అమలు కావాలని కోరుకుంటున్నానని అన్నారు. అందుకే తాను బిజెపిలోకి వచ్చానని అన్నారు.