అభివృద్ధి పనుల ప్రగతిపై మంత్రి ఎర్రబెల్లి సవిూక్ష


వరంగల్‌,డిసెంబర్‌ 10 జనంసాక్షి:    పాలకుర్తి`బమ్మెర` వల్మిడి కారిడార్‌ పనుల ప్రగతిపై పాలకుర్తి ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో రాష్ట్ర పంచాయతీరాజ్‌ గ్రావిూణాభివృద్ధి గ్రావిూణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు శుక్రవారం సవిూక్షించారు. ప్రభుత్వం పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం, బమ్మెర పోతన స్మారక మందిరం, వల్మీడి శ్రీ సీతారామ చంద్ర స్వామి దేవాలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేసింది. గతంలో సీఎం కెసిఆర్‌ ఈ ప్రాంతాన్ని సందర్శించి పాలకుర్తికి రూ.10 కోట్లు, బమ్మెరకు రూ.7.50 కోట్లు, వల్మీడీకి రూ.5 కోట్లు మంజూరు చేసిన సంగతి తెలిసిందే.