హాజరు కానున్న చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ,సిఎం కేసీఆర్
హైదరాబాద్,డిసెంబర్3 (జనంసాక్షి) : ఈ నెల 4న శనివారం హైదరాబాద్‌లోని నోవాటెల్ హెచ్‌ఐసీసీలో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ విూడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ) హైదరాబాద్ సదస్సు జరగనుంది. ఈ సదస్సులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పాల్గొననున్నారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ స్వాగతోపన్యాసం చేయనుండగా.. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు అధ్యక్షోపన్యాసం ఇస్తారు. సదస్సు అనంతరం రెండు ప్యానెల్ చర్చలుంటాయి. ఏడీఆర్ (ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజొల్యూషన్) పక్రియపై జరిగే చర్చకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్ సుభా?షరెడ్డి, ఆర్బిట్రేషన్, విూడియేషన్ పాత్రపై జరిగే చర్చకు సుప్రీంకోర్టు మరో న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లి నేతృత్వం వహిస్తారు. ముగింపు కార్యక్రమాల్లో మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొంటారు.