కరీంనగర్,డిసెంబర్31(జనంసాక్షి): మెట్టప్రాంత రైతులు కరువుతో తల్లడిల్లుతుంటే గోదావరి నీళ్లను
తీసుకొచ్చి కష్టాలు తీర్చి అన్నదాతల మొముల్లో ఆనందం నింపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని మార్క్‌ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి కొనియాడారు. ఎల్లంపెల్లి ఎత్తిపోతల నీళ్లు చేరుకోవడంతో కథలాపూర్
మండలం తాండ్యాల్ర, ఇప్పపెల్లి గ్రామాల్లోని చెరువులు జలకళను సంతరించుకున్నాయి. కథలాపూర్ మండలానికి ఓ వైపు కాళేశ్వరం నీళ్లు, మరోవైపు ఎల్లంపల్లి ఎత్తిపోతల ద్వారా సూరమ్మ రిజర్వాయర్ నీళ్లు వస్తుండడంతో రైతుల్లో సంతోషం వెల్లివిరుస్తున్నదన్నారు. చెరువులు జలకళ సంతరించుకోవడంతో అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడిన రైతాంగానికి ఎంతో ఊరట లభిస్తున్నదన్నారు. అధికారంలోకి రాగానే రైతుల ముఖంలో సంతోషం నింపడమే లక్ష్యమని ప్రకటించిన సీఎం కేసీఆర్ ఆ దిశగా ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. సబ్సిడీపై పరికరాలు, పంటలకు మద్దతు ధర కల్పిస్తూ అన్నివిధాల అండగా ఉంటున్నారన్నా రు. ప్రతిపక్షాలు రైతులను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నాయని, వారిని గమనించాలని సూచించారు.