మన ఊరు`మన ఎమ్మెల్యే కార్యక్రమంలో శంకర్ నాయక్
మహబూబాబాద్,డిసెంబర్9(జనంసాక్షి ): సీఎం కేసీఆర్ పాలనలో గ్రామాలు అభివృద్ధి చెందాయని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. మన ఊరు`మన ఎమ్మెల్యే 8వ రోజు కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్ మండలంలోని అమనగల్, గుండాల గడ్డ తండా, బలరాం తండా గ్రామ పంచాయతీల్లో గురువారం ఎమ్మెల్యే పర్యటించారు. ప్రజలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.ప్రజలు అడిగిన సమస్యలకు అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ పాలనలో గ్రామాలు సమగ్రంగా అభివృద్ధి చెందాయన్నారు. ఓట్ల కోసం కాదు ఓట్ల నాడు ఇచ్చిన హావిూ మేరకు సమస్యల సాధన కోసమే గ్రామ గ్రామం నేను తిరుగుతు న్నానని స్పష్టం చేశారు. ప్రజల సమస్యలను త్వరలో పరిష్కరిస్తా అన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ప్రియాంక, నాయిని రంజిత్, సూదగని మురళి, తేళ్ల శ్రీనివాస్, యాస వెంకట్ రెడ్డి, అశోక్, కవిత, మంజుల, తప్పెట్ల వెంకన్న, గంధం ఉప్పలయ్య, సురేందర్, రాంచంద్రు, గుట్టయ్య, తదితరులు పాల్గొన్నారు.