విజయవాడ,డిసెంబర్10 జనంసాక్షి: నగరంలో చడ్డీ గ్యాంగ్ అరాచకాలపై పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సందర్భంగా ఆయన విూడియాతో మాట్లాడుతూ చడ్డీ గ్యాంగ్ వ్యవహారంలో బెజవాడ ప్రజలు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. త్వరలోనే చడ్డీగ్యాంగ్‌ను పట్టుకుంటామన్నారు. ఇప్పటికే ఘటనా ప్రదేశాల్లో వేలిముద్రలు సేకరించామన్నారు. చడ్డీగ్యాంగ్ సభ్యులు గుజరాత్, మధ్యప్రదేశ్‌కు చెందినవాళ్లుగా గుర్తించామని, రైల్వే పరిసరాలను స్థావరాలుగా మార్చుకుని చోరీలకు పాల్పడుతున్నారని సీపీ తెలిపారు. అపార్ట్‌మెంట్స్, కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. చడ్డీ గ్యాంగ్ భౌతిక దాడులు చేయరని, కేవలం ఎవరు లేని సమయంలో దొంగతనాలకు పాల్పడతారని సీపీ క్రాంతి రాణా టాటా తెలిపారు.
చడ్డీగ్యాంగ్ పనిపడతాం పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా