అంబేడ్కర్‌ బాట అనుసరణీయంనివాళి

  

అర్పించిన టిడిపి అధినేత చంద్రబాబు

అమరావతి,డిసెంబర్‌6 జనంసాక్షి :  సమాజంలో విశాల భావాలు పెంపొందించేందుకు అంబేద్కర్‌ ప్రబోధించిన సిద్దాంతాలు ఎప్పటికీ అమరం, ఆదర్శప్రాయమని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. నేడు అంబేద్కర్‌ వర్‌ సందర్భంగా చంద్రబాబు ఆయనను ట్విటర్‌ వేదికగా స్మరించుకున్నారు. దేశ ప్రజలందరికీ స్వేచ్ఛ, సాంఘిక, ఆర్థిక, రాజకీయ సమ న్యాయం చేకూర్చేందుకు అంబేద్కర్‌ మహాశయుడు రూపొందించిన రాజ్యాంగ పరిరక్షణ కోసం కృషిచేయడమే ఆయనకు మనం అర్పించే అసలైన నివాళి అని చంద్రబాబు ట్వీట్‌లో పేర్కొన్నారు.  అణగారిన వర్గాల ఆశాజ్యోతి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ 65వ వర్ధంతి సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్‌ ఘనంగా నివాళు లర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరికీ సమానత్వమే నిజమైన అభివృద్ధి అని చాటిచెప్పిన మహనీయుడని, భారత ప్రజాస్వామ్యగణతంత్రానికి దీపధారి అంబేద్కర్‌ అని కొనయాడారు. దేశం అభివృద్ధి చెందడమంటే, అద్దాల మేడలు, రంగుల గోడలు ఉండటంకాదని, స్వేచ్ఛ, సాంఘిక, ఆర్థిక, రాజకీయ సమన్యాయం దేశ ప్రజలందరికీ అందించడమే అసలైన అభివృద్ధి అని చెప్పిన మహనీయులని లోకేశ్‌ అన్నారు. నిత్య చైతన్య మూర్తి బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ అని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ కొనియాడారు. నేడు అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా పవన్‌ ఆయనను స్మరించుకున్నారు. ‘నేను ఆరాధించే గొప్ప సంఘ సంస్కర్త అంబేద్కర్‌. రాజ్యాంగంలో ఆయన కల్పించిన పౌర హక్కులు ఆదేశిక సూత్రాలు ప్రజలకు రక్షణగా నిలుస్తున్నాయి. అంబేద్కర్‌ గారు చూపిన మార్గంలోనే జనసేన ప్రస్థానం కొనసాగుతుంది‘ అని పేర్కొన్నారు.