ఆదిలాబాద్,డిసెంబర్3 (జనంసాక్షి) : జిల్లా వ్యాప్తంగా దాదాపు 200లకు పైగా కేంద్రాల్లో కరోనా వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో 18 ఏండ్లు నిండి వ్యాక్సిన్‌కు అర్హులైన వారు 5,36,109 మంది ఉన్నారు. ఇందులో మొదటి డోసు వ్యాక్సిన్ ఇప్పటి వరకు 5,10,288 మంది తీసుకున్నారు. ఇప్పటికి మొదటి డోసు వేయించుకోని వారు 25,821 మంది ఉన్నారు. వ్యాక్సిన్‌పై వీరు ఆసక్తి చూపడం లేదు. జిల్లాలో మొదటి డోసు వ్యాక్సిన్ 95.18 శాతం పూర్తయ్యింది. రెండో డోసు 45.74 శాతానికి చేరింది. ఇప్పటి వరకు రెండో డోసు వ్యాక్సిన్ 2,07,897 మంది వేయించుకున్నారు. మొదటి డోసు కొవిషీల్డ్ తీసుకున్న వారిలో 84 రోజుల గడువు, కొవాగ్జీన్ 28 రోజుల గడువు పూర్తయినప్పటికీ రెండో డోసు వేయించుకోని వారు 42,125 మంది ఉన్నారు.