రోడ్లకు ఇరువైపులా కంపచెట్ల తొలగింపు

  

అనంతపురం, డిసెంబర్‌3 (జనం సాక్షి)     : చోళ సముద్రం నుండి నాగానపల్లి వరకు దాదాపు మూడు కిలోవిూటర్లు రోడ్లలో ఉన్న కంపచెట్లను సర్పంచ్‌ హయాంలో శుక్రవారం తొలగించారు. హిందూపురం నియోజకవర్గం వైసిపి ఇన్చార్జ్‌ ఎమ్మెల్సీ షేక్‌ మహమ్మద్‌ ఇక్బాల్‌ స్ఫూర్తితో లేపాక్షి మండలం చోళ సముద్రం పంచాయితీ సర్పంచ్‌ నందిని ఆధ్వర్యంలో చోళ సముద్రం నుండి నాగానపల్లి వరకు దాదాపు మూడు కిలోవిూటర్లు రోడ్డు క్రాసింగ్‌ లు ఎక్కువ ఉండటంతో ప్రమాదాలు జరగకుండా నివారించడానికి రోడ్డుకు ఇరువైపులా పెరిగిన కంప చెట్లను, చెత్తాచెదారాన్ని జెసిబి ద్వారా తొలగించి శుభ్రం చేశారు. కంపచెట్లను తొలగించినందుకు రెండు గ్రామాల ప్రజలు సర్పంచ్‌ కి కఅతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ నందిని, వైస్‌ సర్పంచ్‌ చంద్ర, శ్రీరాములు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.