కరోనా కొత్త వేరియంట్ ఓమైక్రాన్ గురించి ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. భారత్‌తో సహా ప్రపంచంలోని 38 దేశాల్లో ఓమైమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచాన్ని వణుకు పుట్టించిన సృష్టించిన డెల్టా వేరియంట్ కంటే చాలా రెట్లు ఎక్కువగా ఉంటుదని పేర్కొంటున్నారు. దీంతో ఓమైక్రాన్‌ను ’సూపర్ మైల్డ్’గా సూచిస్తున్నారు. అలాగే, దాని స్పైక్ ప్రొటీన్‌లో 30 కంటే ఎక్కువ మ్యుటేష న్‌ల కారణంగా, దానిపై టీకా ప్రభావం తక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. భారతదేశంలో మూడవ వేవ్ రానుందా అనే భయాందోళనలు నెలకొన్నాయి. కాన్పూర్ అధ్యయనంలో పాల్గొన్న ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ విశ్లేషణ ప్రకారం, ఒమైక్రాన్ వేరియంట్ కారణంగా, 2022 ప్రారంభంలో భారతదేశంలో కరోనా మూడవ వేవ్ ఉండ వచ్చు. ఈ నివేదిక ప్రకారం, మూడవ వేవ్ సమయంలో, ఫిబ్రవరిలో భారతదేశం గరిష్టంగా 1.5 లక్షల రోజు వారీ కోవిడ్ కేసులు నమోదవుతాయి. రెండవ వేవ్ సమయంలో, భారతదేశంలో రోజువారీ కోవిడ్ కేసుల సంఖ్య 4 లక్షలు దాటింది. అదే సమయంలో, రాబోయే కొద్ది నెలల్లో ఐరోపాలో ఓమిక్రాన్ కేసులలో భారీ పెరుగుదల వచ్చే అవకాశం ఉంది. రాబోయే కొద్ది నెలల్లో యూరప్‌లోని మొత్తం కరోనావైరస్ కేసుల లో సగానికి పైగా ఓమిక్రాన్ కారణమని యూరోపియన్ యూనియన్ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ ప్రకటించింది. ఈ క్రమంలో మనదేశంలో పెరుగుతున్న కేసుల దృష్ట్యా ప్రజలు మరింత అప్రమత్తం గా ఉండాల్సిన అవసరాన్ని సూచిస్తోంది. పెళ్లిళ్లు,జాతరలకాలం కావడంతో ప్రజలకు వ్యక్తిగత పరిశుభ్రత లతో పాటు రక్షణచర్యలకు సిద్దం కావాలి. ఓ వైపు ఒమైక్రాన్ గురించి ప్రభుత్వం హెచ్చరికలు చేస్తున్నా ప్రజల్లో ఇంకా నిర్లిప్తత తొలగి నట్లు కానరావడం లేదు. ఒక్క కేసు కూడా లేని దశలో ఇటీవల విదేవాలనుంచి వచ్చినవారిలో 21మందికి వైరస్ సోకినట్లు గుర్తించారు. ఇదిచాలు వరస్ వేగంగా వ్యాప్తించడానికి అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దక్షిణాఫ్రికాలో ఓమిక్రాన్ మొదటి కేసు వెలుగుచూసిన కేవలం 10 రోజుల్లో, ఇది భారతదేశం, అమెరికాతో సహా ప్రపంచంలోని 38 దేశాలకు వ్యాపించింది. చాలా వేగంగా వ్యాప్తి చెందు తున్నప్పటికీ,ఇప్పటివరకు ఇది సోకిన చాలా మంది రోగులలో తేలికపాటి లక్షణాలు మాత్రమే కనిపించాయి. వారిలో ఎవరికీ తీవ్రమైన ఇన్ఫెక్షన్ లేదా ఎఅఙలో చేరలేదు. ఇంతవరకు ఎవరూ మరణించ లేదు. ఎలాంటి వైరస్ అయినా మాస్కులు ధరించి.. శానిటైజర్ ఉపయోగిస్తే రక్షణుంటుందని అంటున్నారు. ఇప్పటివరకు, ఆఫ్రికా, ఐరోపా దేశాలలో అత్యధిక సంఖ్యలో ఓమైక్రాన్ కేసులు నమోదయ్యాయి. నవంబర్ 24న దక్షిణా ఫ్రికాలో ఓమిక్రాన్ వేరియంట్ బయటపడ్డ వారంలోపే, డిసెంబరు 1న రోజువారీ కరోనా కేసులు 8500కి రెండిరతలు పెరిగాయి. అయితే తిరిగి సోకిన రోగులలో టీకాలు వేసినప్పటికీ ఓమిక్రాన్ సోకిన వారిలో తేలికపాటి లక్షణాలు మాత్రమే కనిపించాయి. కొత్త వేరియంట్ ఓమిక్రాన్ ఆఫ్ కరోనాలో 50 కంటే ఎక్కువ మ్యుటేషన్‌లు జరిగాయి. ఇది మాత్రమే కాదు, డెల్టాతో పోలిస్తే ఓమిక్రాన్ స్పైక్ ప్రోటీన్ కూడా 30 కంటే ఎక్కువ ఉత్పరివర్తనాలను కలిగి ఉంది. ఇది ఇప్పటివరకు వచ్చిన కరోనా కేసుల కంటే అత్యంత ప్రమాద కరమైన రూపాంతరంగా పరిగణి స్తున్నారు. ఈ అనేక ఉత్పరివర్తనలు డెల్టా కంటే ఓమిక్రాన్‌ను మరింత వేగంగా వ్యాప్తి చెందుతున్న రూపాంతరంగా మార్చాయి. దక్షిణాఫ్రికా లేదా యూరప్‌లో ఓమిక్రాన్ సోకిన యువతలో ఎక్కువ మంది ఉన్నట్లు ప్రాథమిక డేటా చూపిస్తుంది. అలాగే, ఈ రూపాంతరం టీకా రెండు మోతాదులను పొందిన వ్యక్తులకు కూడా సోకింది. ఈ రెండు విషయాలు ఈ వేరియంట్ గురించి ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ రెండు కారకాలు ఒమిక్రాన్ యువకులకు, పూర్తిగా టీకాలు వేసిన వ్యక్తులకు సోకగలదని అర్థం చేసు కోవచ్చు. వీరు వృద్ధుల కంటే బలమైన రోగనిరోధక శక్తిని కలిగి ఉంటారనడంలో సందేహం లేదు. అయినా వీరిని వదిలిపెట్టడంలేదు. అందువల్ల ప్రజలు తమదరికి రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, లేకుంటే వేయి రేపాయల జరిమానా విధిస్తామని కూడా తెలంగాణ ప్రభుత్వం హెచ్చరికలు జారీచేసింది. దీనికితోడు వైరస్ బారిన పడితే ఎవరూ రక్షించలేరని, ఆస్తప్రులకు పెట్టే బదులు ముందు జాగ్రత్తలే మేలని సూచిస్తున్నారు. ఎపిడెమియాలజిస్టుల నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థ వరకు నిపుణులు ఓమిక్రాన్‌ను తేలికపాటి లక్షణాలతో కూడిన ’సూపర్ మైల్డ్’ వేరియంట్‌గా పేర్కొన్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది చాలా వేగంగా వ్యాపించే సామర్థ్యం కలిగి ఉంది. అయితే ఇది తీవ్రమైన ఇన్ఫెక్షన్ కంటే తేలికపాటి లక్షణాలను మాత్రమే కలిగిస్తుందని పేర్కొన్నారు. తేలికపాటి లక్షణాలు, తక్కువ మరణ ప్రమాదం ఉన్నందున ఓమిక్రాన్‌ను ’సూపర్ మైల్డ్’గా సూచిస్తారు. ఓమిక్రాన్ తేలికపాటి లక్షణాలను బట్టి, ప్రస్తుతం భయపడాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు చికిత్స చేసిన కోవిడ్ రోగులతో పోలిస్తే ఓమిక్రాన్ లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని దక్షిణాఫ్రికా నిపుణులు తెలిపారు. దక్షిణాఫ్రికా వైద్యులు ఇప్పటి వరకు కనిపించిన ఓమిక్రాన్ రోగులలో చాలా మందికి తేలికపాటి లక్షణాలు ఉన్నాయని, తీవ్రమైనవి కాదని పేర్కొన్నారు. ఒమైక్రాన్ నుంచి ఎటువంటి తీవ్రమైన అనారోగ్యం లేదా మరణాలు లేవని వైద్యులు చెబుతు న్నారు. ఇది వేగంగా వ్యాప్తి చెందుతుంది. కానీ అంత ప్రాణాంతకం కాదని సూచిస్తుంది. ఒమైక్రాన్‌కు సంబం ధించి ఆఫ్రికా దేశాలపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు విధించిన ట్రావెల్ బ్యాన్ అనవసరమని పేర్కొ న్నారు. ఇకపోతే ఈ కొత్త వేరియంట్‌తో సోకిన వారిలో సగం మందికి లక్షణాలు లేవు. సగం మందికి తేలిక పాటి లక్షణాలు ఉన్నాయి. ఐరోపాలో ఓమిక్రాన్ సోకిన వారిలో తీవ్రమైన అనారోగ్యం, ఆసుపత్రిలో చేరడం లేదా మరణిం చిన కేసులు ఏవీ నమోదుకాలేదు. ఈ కొత్త వేరియంట్‌పై పూర్తి వివరాలను పొందడానికి కొన్ని వారాలు పట్టవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఓమిక్రాన్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్న ప్పటికీ తేలికపాటి లక్షణాలను మాత్రమే ఉత్పత్తి చేస్తే, అది జలుబు వంటి సీజనల్ వ్యాధులలా మారు తుందని తెలిపారు. దీని పదునైన మ్యూటెంట్లు బలమైన రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తులకు, టీకాలు వేసిన వ్యక్తులకు కూడా సోకే అవకాశం ఉన్న ఒక రూపాంతరంగా మారాయి. ఇది ఖచ్చితంగా ఆందోళన కలిగించే విషయంగా మారింది. ఈ క్రమంలో దీనిగురించిచర్చించుకోవడం కన్నా వ్యక్తిగత భద్రతపై చర్చించడం మేలని అంటున్నారు.
ఒమైక్రాన్ భయాల్లో ప్రపంచం !