మండిపడ్డ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి
హైదరాబాద్,డిసెంబర్13 (జనం సాక్షి) : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూలిపోయే వరకు మేం పోరాటం చేస్తామని రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు,ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి అన్నారు. ధాన్యం సేకరణలో కేంద్రం పూటకోమాట మాట్లాడుతోందని అన్నారు. రూ.50 వేల కోట్ల నిధులు రైతుల ఖాతాల్లో డైరెక్ట్‌గా వేసిన చరిత్ర సీఎం కేసీఆర్‌ది అని పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్‌లో విూడియా సమావేశంలో మాట్లాడారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ అభివృద్ధిని చూడలేక ప్రగతినిరోధులుగా తయారయ్యారని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధి దేశం అంతా కనిపిస్తున్నా ఇక్కడి కల్లులేని కబోదులైన ప్రతిపక్షాలకు మాత్రం కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సాగు విస్తీర్ణం 51 శాతం పెరిగిందన్నారు. రాష్ట్రంలో అధికారికంగా 2లక్షలు, అనధికారికంగా 4లక్షల బోర్లకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాన్నామని పల్లా పేర్కొన్నారు. 2014లో 24 లక్షల మెట్రిక్ టన్నులు, 2020`21లో 141 మెట్రిక్ టన్నులు ఈఅఎ కి తెలంగాణ ఇచ్చిందన్నారు. 42లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రాష్ట్ర ప్రభుత్వం సేకరణ చేసింది. బీజేపీ నాయకులను కళ్లాల దగ్గర రైతులు అడ్డుకుంటే గవర్నర్ ను విజిట్ కు పంపారు. గవర్నర్ ధాన్యం సేకరణ సెంటర్‌ను విజిట్ చేసి ప్రభుత్వం ధాన్యం సేకరణ బాగా జరుగుతుందని మెచ్చుకున్నారనే విషయం మర్చిపోవద్దన్నారు. గత ఏడాది కంటే 11లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ ప్రభుత్వం చేపట్టింది. ఈ రోజు వరకు 5,447 కోట్ల రూపాయలు రైతులకు నిధులు ఇచ్చామని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, పీయూష్ గోయల్ నిత్యం అబద్దాలు చెప్తున్నారని
విమర్శించారు. వచ్చే యాసంగిలో వరి వేయకుండా చేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.
వరి వేస్తే ఒప్పుకునే ప్రభుత్వానికి మేంమద్దతు ఇస్తాం. అలాగే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎల్‌ఐసి సంస్థను ప్రైవేటీకరణ చేసే కుట్రను మేం వ్యతిరేకిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.