హైదరాబాద్,డిసెంబర్9(జనం సాక్షి ): శంషాబాద్‌లో వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. కిషన్ బాగ్ ప్రాంతానికి చెందిన మాజిద్ హుసేన్ అనే వ్యక్తిపై ముహమ్మద్ మోసిన్ అనే వ్యక్తి.. మాంసం కోసే కత్తితో దాడికి పాల్పడ్డాడు. మాజీద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని పోలీసులు హైదరాబాద్‌లోని ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించారు. ఆటో కిరాయి విషయంలో శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్టేషన్ పరిధి రాళ్ళగుడా వద్ద ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.