కామారెడ్డి,డిసెంబర్24(జనం సాక్షి ): మినీ బృహత్ పల్లె ప్రకృతివనాల కోసం స్థలాలను ఎంపిక చేయాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అధికారులకు సూచింª`చారు. శ్రీనిధి బకాయిలను వసూలు చేయాలని ఐకేపీ అధికారులను ఆదేశించారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వందశాతం పూర్తిచేయాలని తెలిపారు. ఐకేపీ ద్వారా గ్రామాల్లో సర్వే చేపట్టి సోలార్ యూనిట్లు కావాల్సిన మహిళల పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు.స్పెషల్ సమ్మరి రివిజన్‌లో భాగంగా అర్హులు ఓటు ను నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని అన్నారు. యువ ఓటర్లలో అవగాహన పెరిగి ఓటరుగా అధికసంఖ్యలో పేరున నమోదు చేసుకోవడానికి అవకాశం ఉందన్నారు. ఓటర్ల జాబితాను గరుడ యాప్‌లో నమోదు చేయాలని తెలిపారు. జనవరి 5నాటికి తుదిజాబితా సిద్ధం చేసి ప్రచురించాలని తెలిపారు. 18సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరు ఓటర్‌గా నమోదు చేసుకోవాలని, ఓటరు నమోదు పక్రియను నిరంతరంగా కొనసాగించాలని తెలిపారు.
పల్లె ప్రకృతివనాల కోసం స్థలాల ఎంపిక