హైదరాబాద్, డిసెంబర్3 (జనం సాక్షి) : మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మాదాపూర్‌లోని సిద్ధిక్ నగర్‌లో నివాసం ఉంటున్న అస్సాం రాష్టాన్రికి చెందిన ఇమాన్స్ రాయ్ (28) తన గదిలో గురువారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.