ఏర్పాట్లు పూర్తి చేశామన్న కలెక్టర్ సిక్తా పట్నాయక్
ఆదిలాబాద్,డిసెంబర్9(జనంసాక్షి ): ఉమ్మడి జిల్లాలో జరిగే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్, కౌంటింగ్‌కు కావాల్సిన ఏర్పాట్లను పూర్తి చేశామని, అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేశామని కలెక్టర్ సిక్తాపట్నాయక్ చెప్పారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎన్నికల నిర్వహణ చేపట్టామన్నారు. పోలింగ్, కౌంటింగ్ వీడియోగ్రఫి, వెబ్‌కాస్టింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. మొబైల్‌ఫోన్లు, కెమెరాలకు పోలింగ్ కేంద్రాలకు, కౌంటింగ్ కేంద్రాలకు అనుమతి లేదని తెలిపారు. ఈనెల 10న శుక్రవారం ఉదయం 8 నుంచి 4 వరకు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసామని తెలిపారు. పోలింగ్ సిబ్బందికి అవసరమైన మౌలిక వసతులు, పోలింగ్ నిర్వాహణకు కావాల్సిన తాగునీరు, ఫర్నిచర్, ఇతర వసతులను ఏర్పా ట్లు చేసినట్లు తెలిపారు. శుక్రవారం జరగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లను కలెక్టర్ ఐటీడీఏ పీవో అంకిత్‌తో కలిసి పరిశీలించారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఉట్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్, గాదిగూడ మండలాల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. పోలింగ్ కేంద్రాల్లో మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడంతో పాటు శానిటైజర్లు ఉపయోగించాలని, హెల్త్ వర్కర్లను నియమించాలని అన్నారు. పోలింగ్ కేంద్రంలోకి సెల్‌ఫోన్లను అనుమతించవద్దని సూచించారు. వెబ్‌కాస్టింగ్ అన్ని కేంద్రా ల్లో నిర్వహించాలని ఆదేశించారు. ఎన్నికల నిర్వహణకు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసామని అన్నారు. పోలింగ్ సామగ్రితో కేంద్రాలకు వెళ్లేటప్పుడు పోలింగ్ పూర్తయిన తర్వాత బ్యాలెట్‌తో రిసెప్షన్ కేంద్రాలకు చేరే వరకు బందోబస్తు ఉంటుందని అన్నారు.మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం లాంటివి వి స్మరించరాదన్నారు. థర్మల్ సెన్సార్‌తో పరీక్షలు చేసి పీపీ కిట్లు అందించాలన్నారు. హెల్త్‌వర్కర్లను, ఏఎన్‌ఎంలను అందుబాటులో ఉంచాలన్నారు. వెబ్ కాస్టింగ్ ని ర్వహించాలని, పోలీస్ బందోబస్తు మధ్య ఎన్నికలు జరపాలన్నారు. ప్రభుత్వం గుర్తించిన 11 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదీ ఉన్నా ఓటు వేసేందుకు అనుమతించాలని తెలిపారు. ఓటింగ్‌పై ఓటర్లకు అవగాహన కల్పించాలని సూచించారు.