కొత్తకొత్త వేరియంట్లు పుట్టుకొస్తూ ప్రపంచాన్ని వణికిస్తున్న వేళ.. మనమంతా మరింత జాగ్రత్తగా ఉండా ల్సిన అసవరం ఏర్పడిరది. మానవాళికి ముప్పుగా పరిణమిస్తున్న వైరస్‌ల వల్ల జాగ్రత్తలు తీసుకుంటూనే వైద్యరంగాన్ని వెయ్యిరెట్టు బలోపేతం చేసుకోవాలి. మన వైద్యవిధానాలు, పరిశోధనలకు పదను పెట్టాలి. ప్రస్తుత కరోనా వైరస్‌కన్నా ప్రమాదకరమైన మరో కొత్త వైరస్‌ను శాస్త్రవేత్తలు గుర్తించిన నేపథ్యంలో మన పరిశోధనలు మరింత పుంజుకోవాల్సి ఉంది. దక్షిణాఫ్రికాలో బయటపడిన ’ నియోకోవ్’ అనే కొత్త రకం వైరస్‌కు వేగంగా విస్తరించే లక్షణంతో పాటుగా మరణాల రేటు కూడా అధికంగా ఉండే అవకాశముందని హెచ్చరించిన నేపథ్యంలో ఇప్పుడున్న వైద్య చికిత్సల స్థాయి సరిపోదని గుర్తించాలి. ఇక్కడ వైరస్‌కు సంబంధించిన అనుమానాలు కూడా వస్తున్నాయి. ఇప్పటి వరకు వేరియంట్లను మనమెలా గో గట్టెక్కుతూ వస్తున్నాం. చైనాలోని వుహాన్ శాస్త్రవేత్తలు హెచ్చరికలు చేయడం ప్రపంచాన్ని మరోసారి భయాందోళ నలకు గురి చేస్తోంది. దక్షిణాఫ్రికాలోని ఓ ప్రాంతంలో ఉండే గబ్బిలాల్లో ఈ నియోకోవ్ వైరస్ బయట పడిరది. ఇది కూడా కరోనా వైరసేనని శాస్త్రవేత్తలు తెలిపారు. దీనిపై చైనాలోని వుహాన్ శాస్త్రవేత్తలు పరిశోధనలు జరపగా అనేక ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చినట్లు రష్యా అధికారిక విూడియా సంస్థ స్పుత్నిక్ తన కథనంలో పేర్కొంది. అయితే ఇదో కొత్త తరహా మోసంగా కూడా అనుమానించా ల్సిందే. చైనా ఇప్పటికే ప్రపంచాన్ని సర్వనాశనం చేయడానికి వేసిన ఎత్తులు ఫలించాయి. వూహాన్ నుంచి కరోనా వైరస్ ప్రపంచాన్ని చుట్టుముట్టిందని తేలింది. మళ్లీ వూహాన్ వేదికగా ఏదైనా కొత్త ఉపద్రవం రానుందా అన్నది కూడా ప్రపంచం ఆలోచించాలి. ఏదెలా ఉన్నా మనమంతా అప్రమత్తంగా ఉంటూనే.. రాగల ముప్పును ఎదుర్కొనేందుకు సన్నద్దం కావాలి. ప్రస్తుతం ఇది జంతువులనుంచి జంతువులకు మాత్రమే సోకుతున్న వైరస్‌గా గుర్తించారు. అయితే ఇందులోని ఓ మ్యుటేషన్ కారణంగా వైరస్ జంతువుల నుంచి మనుషులకు సోకే ప్రమాదం ఉందని వుహన్ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. కొవిడ్19తో పోలిస్తే నియోకోవ్ వైరస్ కాస్త భిన్నమైనదే కాక ప్రమాదకరమైనదని కూడా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తు న్నారు. యాంటీ బాడీలు, కొవిడ్ వ్యాక్సిన్లు కూడా దీనికి పని చేయకపోవచ్చని చెబుతున్నారు. ఈ వైరస్ మనుషులకు వ్యాపిస్తే.. సోకిన ప్రతి ముగ్‌గ్గురిలో ఒకరికి ప్రాణాపాయం తప్పదని హెచ్చరిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇది జంతువుల్లో మాత్రమే ఉన్నందున దీనిపై ఇప్పుడే ఒక అంచనాకు రాలేమని అంటున్నారు. చైనా శాస్త్రవేత్తలు జరిపిన ఫలితాలపై మరోసారి అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. ఏదేమైనా ఇది మానవాళికి ముఖ్యంగా ప్రపంచ శాస్త్రవేత్తలకు ఇదో హెచ్చరిక కావాలి.
ఇది మనుషులకు ప్రమాదకరమా కాదా అనే విషయంపై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటినుంచే దీనిపైనా పరిశోధనలు చేసి వ్యాక్సిన్ బలోపేతానికి రంగం సిద్దం చేసుకోవాలి. అలాగే మందులను కూడా సిద్దం చేసుకోవాలి. ముందు జాగ్రత్తలతో ప్రపంచం యావత్తూ సమిష్టిగా కదిలేలా ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిపై దృష్టి సారించాలి. ఇకపోతే ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా.. దక్షిణాది రాష్టాల్ల్రో పాజిటివిటీ రేటు పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడుతోపాటు.. గుజరాత్, రాజస్థాన్‌లలోనూ పాజిటివిటీ రేటు పెరిగింది. కేరళలో ఒక్కరోజులో 51 వేల మందికి కరోనా సోకగా.. 94శాతం నమూనాల్లో ఒమైక్రాన్‌ను గుర్తించారు. తల్లి దండ్రులు కొవిడ్ టీకా తీసుకుంటే.. అది పిల్లలకు శ్రీరామరక్ష అని పరిశోధకుల అధ్యయనంలో తేలింది. హార్వర్డ్ వర్సిటీ, ఇజ్రాయెల్‌లోని క్లాలిట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, టెల్`ఏవివ్ యూనివర్సిటీల సంయుక్తపరిశోధనలో తల్లిదండ్రులు తీసుకునే వ్యాక్సిన్, టీకా తీసుకోని చిన్నారులనూ కాపాడుతుందని వారు పేర్కొన్నారు. కరోనా కష్టాలకు దాదాపు రెండేళ్లు కావస్తోంది. అది మనదేశంపై దాడి చేసింది మొదలు.. నేటి వరకు చూసుకుంటే అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. తొలుత మన మూతికి మాస్కు కూడా లేని దశ నుంచి ఇవ్వాళ వ్యాక్సిన్‌ను తయారు చేసి ప్రజలకు అందించే స్థాయికి చేరుకున్నాం. మనదేశ ప్రజలకే కాకుండా ప్రపంచ ప్రజలకు అందించే స్థాయికి చేరుకున్నాం. ఇది సామాన్య విషయం కాదు. భారతదేశం అనుసరించిన ఓ పటిష్ట ప్రణాళికతో మాత్రమే ఇది సాధ్యమయ్యింది. అనేక దేశాలకు ఇప్పటికే వ్యాక్సిన్ ఎగుమతి చేయ గలిగాం. అనేక దేశాలు వ్యాక్సిన్ సరఫరా చేస్తున్నందుకు మనదేశాన్ని అభినంది స్తున్నాయి. కరోనాను ప్రపంచం విూదకు వదిలిన చైనా మాత్రం వ్యాక్సిన్ తయారు చేసి ప్రపంచానికి అండగా నిలవలేక పోయింది. కానీ మనం మాత్రం ఎలాంటి సంకోచం లేకుండా ప్రపంచాన్ని ఆదుకునేం దుకు ముందుకు రాగలిగాం. భారతదేశానికున్న ఆత్మస్థయిర్యానికి..మన మేధో సంపత్తికి ఇది తార్కాణం. భారీ స్థాయిలో కరోనా టీకాలను ఉత్పత్తి చేయలగల భారత్ సామర్థ్యం ప్రపంచానికే ఓ పెద్ద ఆస్తిగా ఐక్య రాజ్యసమితి అభివర్ణించింది. కరోనా మహమ్మారి నిర్మూలన కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఇండియా కీలక పాత్ర పోషిస్తోంది. ఇదే క్రమంలో కొత్తగా పుట్టుకు వచ్చే వైరస్ ల విరుగుడుకు కూడా మనదేశం కేంద్రబిందువు కావాలి. గతంలో ఎన్నో మహమ్మారిలను ఎదుర్కొన్న అనుభవం మనది. అందుకు అకుంఠిత దీక్షతో..దక్షతతో మన సైటింటిస్టులు వ్యాక్సిన్ రూపొందించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్న వేళ మన ప్రజాప్రతినిధులు రాజకీయాలకు అతీతం గా కరోనా ఉపద్రవం, సవాళ్లపై చర్చించాలి. కరోనాపై పోరాటంలో ఎంతో మంది పౌరులను కోల్పోయాం. బడ్జెట్ సమావేశాలు జరుగున్న వేళ ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకో వడం మంచింది. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది బడుగ,బలహీన, సామాన్య ప్రజలకు ఏ మేరకు మేలు చేస్తుందన్న దృష్టితో ముందుకు సాగాలి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా సమస్య ఉంది... అయితే భారత్ సమర్థంగా ఎదుర్కొని ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. అయినా ఇంకా అనేకానేక సమస్యలను దేశ ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వం దీనిపై ప్రధానంగా దృష్టి సారించాలి.