విత్తన కేంద్రాల అభివృద్దికి చర్యలు
అంతరపంటలపై రైతులకు అవగాహన
హైదరాబాద్,జనవరి29 (జనంసాక్షి) ప్రకృతి వ్యవసాయంతోనే ఆహార రంగాన్ని బలోపేతం చేసుకోవచ్చని వ్యవసాయవేత్తలు సూచిస్తున్నారు. బలవర్ధకమైన ఆహారం అన్నది సేంద్రియ పద్దతుల ద్వారానే సాధ్యమని అంటున్నారు. ఈ క్రమంలో అనవసర రసాయన ఎరువులతో పంటలు పండిరచకుండా సేంద్రియ వ్యవసాయంపై రైతులు మక్కువ పెంచుకోవాలి. ఇందుకు ప్రభుత్వాలు కూడా తగిన చేయూతను ఇవ్వాల్సి ఉంటుంది. రాష్టాన్న్రి విత్తన కేంద్రంగా మార్చుకోవడానికి సీఎం కేసీఆర్ పలు చర్యలు తీసుకొంటున్నారు. విత్తన ఉత్పత్తి విషయంలో తెలంగాణ జిల్లాలు అగ్రస్థానంలో నిలబడి ఎక్కువ మంది రైతులు విత్తన ఉత్పత్తిలో పాల్గొనేలా కార్యాచరణ చేస్తున్నారు. ఇకపోతే నానాటీకి అంతరించి పోతున్న ఆవులను సంరక్షించుకొంటే ఎన్నో లాభాలు ఉన్నాయని, ఒక్క ఆవు పేడ, మూత్రంతో దాదాపు 25 నుంచి 30 ఎకరాలను సాగుచేయవచ్చునని, దీంతో సాగుచేసిన పంటలు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయని వ్యవసాయ నిపుణులు తెలిపారు. అంతర పంటల ద్వారా వచ్చే లాభంతో ప్రధాన పంట ఖర్చులు తీరి
పోతాయి. ప్రధాన పంట నుంచి వచ్చే సంపాదన అదనపు సంపాదన అవుతుంది. ఏక పంటలు సాగు చేయకుండా మిశ్రమ పంటలను సాగుచేస్తే కనీసం 20 రకాల పంటలు వేసుకొవచ్చు. వ్యవసాయంలో బీజామృతం, జీవామృతం, ఘనజీవామృతం, నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం, అగ్నిఅస్త్రం, దశపర్ని కషాయం, సప్త దాన్యాంకుర కషాయం, ఆచ్చాదన, వాప్స వంటి పద్ధతుల్లో ప్రకృతి వ్యవసాయం చేసుకోవచ్చన్నారు. ఈ పద్ధతిలో మామిడి, కొబ్బరి, చింత, శీతాఫలం, దానిమ్మ, ఆముదంతో పాటు పసుపు, చెరకు, మొక్క జొన్న, వరి పంటలను పండిరచవచ్చని తెలిపారు. ప్రస్తుతం విత్తన ఉత్పత్తికి రైతులతో ఒప్పందాలకు కంపెనీల ప్రతినిధులు సుముఖత వ్యక్తం చేశారు. వరి, మొక్కజొన్నకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తారు. మరికొంత విస్తీర్ణంలోనూ పంటలు వేసేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు.రైతులు లాభాలు ఆర్జించేందుకు ప్రోత్సాహం అందించాలని విత్తన కంపెనీలకు ఇటీవల మంత్రి పోచారం సూచించారు. విత్తన ఉత్పత్తి చేసే రైతులు అధిక లాభాలను ఆర్జించేలా వారిని ప్రోత్సహించాల్సిన అవసరముందని అన్నారు. రాష్టాన్న్రి విత్తన కేంద్రంగా మార్చాలన్న లక్ష్యంతో సీఎం అనేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు ఇటీవల విత్తన కంపెనీల ప్రతినిధులతో సమావేశమయి చర్చించారు. దీనికితోడు ఇంజినీరింగ్ విద్యార్థులు యాంత్రికసాగుపై దృష్టి సారించి అధిక లాభాలు వచ్చేలా కొత్త పద్ధతులు రూపొందించాలని దిశానిర్దేశం చేశారు. పాశ్చాత్య దేశాల్లో యాంత్రికసాగు చేస్తూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సాధిస్తున్నారు. యాంత్రిక సాగుపై దృష్టిసారించి అధిక లాభాలు వచ్చే కొత్త పద్ధతులు రూపొందించాలని పిలుపునిచ్చారు. పాలీహౌస్ సాగులక్ష్యం పెంచాలని నిర్ణయించారు. గత ప్రభుత్వాలు ప్రాజెక్టులు నిర్మించకపోవడంతోనే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఆ పాపం వారిదేనన్నారు. దేశంలో తొలిసారిగా పాలీహౌస్ సాగును హర్యానాలో ప్రారంభించారని, ఏడాదికి 150 ఎకరాల్లో సాగు చేస్తే.. తెలంగాణలో వేయిఎకరాల్లో సాగైందని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. మెదక్,నిజామాబాద్ జిల్లాల్లో పాలీహౌస్ సాగుచేస్తూ బాగా సంపాదిస్తున్నారని చెప్పారు. దీంతో కూరగాయలు, పళ్లు పండిరచవచ్చిన అంటున్నారు. సిఎం కెసిఆర్ కూడా కూరగాయల సాగుకు ప్రోత్సాహం ఇవ్వనున్నట్లు వంటిమామిడి పర్యటన సందర్భంగా తెలిపారు.