హైదరాబాద్: ఈ నెల 14 నుంచి కోర్టుల్లో ప్రత్యక్ష విచారణలు నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కొవిడ్ జాగ్రత్తలతో కోర్టులు నిర్వహించాలని ఉత్తర్వులు ఇచ్చింది. కరోనా వ్యాప్తి కారణంగా గత నెల 17 నుంచి కోర్టుల కార్యకలాపాలు ఆన్‌లైన్‌లో కొనసాగుతున్నాయి. అయితే ఈ నెల 13 వరకు వర్చువల్ విచారణలు కొనసాగుతాయని హైకోర్టు పేర్కొంది. కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో ప్రత్యక్ష విచారణలకు ఉన్నత న్యాయస్థానం అనుమతిచ్చింది.