దేశవ్యాప్తంగా ఈ ఏడాది 5జీ సాంకేతికత
న్యూఢల్లీి,ఫిబ్రవరి1 (జనం సాక్షి): దేశవ్యాప్తంగా ఈ ఏడాది 5జీ సాంకేతికత అందుబాటులోకి వస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడిరచారు. 2022`23లో ప్రైవేటు సంస్థల ద్వారా 5జీ సాంకేతికత ప్రవేశపెడుతున్నామని చెప్పారు. 2022`23లో భారత్ నెట్ ప్రాజెక్టు ద్వారా పీపీపీ పద్ధతిలో మారుమూల ప్రాంతాలకు కూడా ఆప్టికల్ ్గªబైర్ నెట్‌వర్క్ విస్తరిస్తామని పేర్కొన్నారు. నగరాలు, పట్టణాల అభివృద్ధికి నూతన పట్టణ ప్రణాళిక, నగరాల్లో ప్రయాణ సౌకర్యాల అభివృద్ధిపట్టణాలు, నగరాల్లో నిర్మాణరంగంలో సంస్కరణలు, పట్టణ ప్రణాళిక అభివృద్ధికి ప్రత్యేక కోర్సులు, సిలబస్ తీసుకొస్తామని వెల్లడిరచారు.