ప్రజా విశ్వాసం కోల్పోవడంతోను పికెతో మంతనాలు
కెసిఆర్‌కు చెక్ పెడతామని బండి వ్యాఖ్యలుబిజెపి పదాధికారుల సమావేశంలో వెల్లడి
కెసిఆర్ పొలిటికల్ టూరిస్ట్ అన్న తరుణ్ చుగ్
ఎప్రిల్ 14నుంచి తిరిగి రెండో విడత యాత్ర
హైదరాబాద్,ఫిబ్రవరి28 ( జనం సాక్షి): తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా తమ సత్తా చాటుతామని, కేసీఆర్‌కు బుద్ధి చెబుతామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.హైదరాబాద్ బీజేపీ జోనల్ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మాట్లాడారు. ఈనెల 6 నుండి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సదస్సులు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. తొలుత హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించాలని నిర్ణయించాం. భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆశీస్సులతో హైదరాబాద్ నుండి చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర సక్సెస్ అయ్యింది. అందుకే పార్లమెంట్ స్థాయి తొలి సదస్సు హైదరాబాద్ లో నిర్వహిస్తున్నాం. అంబేద్కర్ జయంతిని పురస్కరించకుని ఏప్రిల్ 14 నుండి రెండో దశ ’ప్రజా సంగ్రామ యాత్ర’ ప్రారంభిస్తున్నట్లు వెల్లడిరచారు. .సీఎం కేసీఆర్ జనగామ సభలో మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ ఉనికి లేదన్నారు. అదే జనగామలోనే మార్చి నెలాఖరులో బీజేపీ బహిరంగ సభ నిర్వహించి పార్టీ సత్తా చూపిస్తామన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల సంఘానికి సమర్పించిన తప్పుడు అఫిడవిట్ పై ఫిర్యాదు చేసిన వారిని పోలీసులే కిడ్నాప్ చేయడం అత్యంత దారుణం అన్నారు. సీఎం కార్యాలయం నుండి వచ్చిన ఆదేశాలతో పోలీసులు ఫిర్యాదు దారులను పోలీసులే కిడ్నాప్ చేశారు.మంత్రి శ్రీనివాస్ గౌడ్ అవినీతి, భూ కబ్జాలను సహించలేక ఫిర్యాదు చేస్తే కిడ్నాప్ చేయడం అన్యాయమన్నారు. బీజేపీ ఆందోళనతో కిడ్నాప్ చేసిన ఫిర్యాదు దారులను పోలీసులు బయటకు తీసుకొచ్చినప్పటికీ వారిపై 307 సెక్షన్ కింద కేసులు నమోదు చేయడం అన్యాయమన్నారు. ఎన్నికల కమిషన్ మంత్రి తప్పుడు అఫిడవిట్ పై ఎన్నికల కమిషన్ విచారణ ముగిసే వరకుల 6 గురు ఫిర్యాదు దారులను జైళ్లో పెట్లడమే లక్ష్యంగా కేసులు నమోదు చేశారు.చట్టబద్దంగా కొట్లాడే ధైర్యం లేని సీఎం అడ్డగోలుగా గెలిచి అవినీతికి పాల్పడుతున్న మంత్రికి వత్తాసు పలుకుతూ కిడ్నాప్ లు చేయించడం సిగ్గుచేటన్నారు. బీజేపీ ఇలాంటి దారుణాలను అడ్డుకుని తీరుతుంది. మంత్రి రాజీనామా చేసే వరకు పార్టీ పరంగా ఆందోళనలను కొనసాగిస్తాం. రాబోయే రోజుల్లో మంత్రులతోపాటు టీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలపై జిల్లాలు, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఉద్యమిస్తాం.గత ఎన్నికలకు ముందు ఆయా నేతలు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లలో చూపిన ఆస్తులను, ఎమ్మెల్యేలు, మంత్రులయ్యాక సంపాదించిన ఆస్తులను బేరీజు వేసి వాటి ఆధారంగా విచారణ జరిగేదాకా ప్రజా క్షేత్రంలో పోరాడతామన్నారు. బీజేపీ కార్యకర్తలు చేసిన పోరాటాలవల్లే బెంగాల్ లో బీజేపీ ఓట్ల శాతం 40 శాతం దాటింది. గత ఎన్నికలతో పోలిస్తే తెలంగాణలో బీజేపీ ఓట్ల శాతం గణనీయంగా పెరుగుతోంది. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ, హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలే నిదర్శనం. హైదరాబాద్ సిటీలో బీజేపీ ఓటు బ్యాంక్ 60 శాతానికి పెరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతైంది. గత ఎన్నికల ఫలితాలతోపాటు వివిధ సర్వేల్లో వెల్లడైన ఫలితాలే నిదర్శనం. బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని తెలియడంతో సీఎం కేసీఆర్ బోగస్ సర్వే ఫలితాలను సోషల్ విూడియా ద్వారా ప్రచారం చేయిస్తున్నారు. తెలంగాణ ప్రజలు నరేంద్ర మోదీ ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని కోరుకుంటున్నారని బండి సంజయ్ అన్నారు. ప్రశాంత్ కిషోర్‌లు బీజేపీకి అవసరం లేదని ఆ పార్టీ ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్ పేర్కొన్నారు. బీజేపీ బూత్ స్థాయి కార్యకర్త ఒక పీకేతో సమానమన్నారు. భారతదేశానికే కాదు.. ఉక్రెయిన్‌కి కూడా కేసీఆర్ ప్రధాని అవుతారని సెటైర్లు వేశారు. తెలంగాణను వదిలేసి.. కేసీఆర్ పొలిటికల్ టూరిస్ట్‌లా తిరుగుతున్నాడని తరుణ్ చుగ్ పేర్కొన్నారు. ఢల్లీి సీఎంతో సమావేశం అయినంత మాత్రాన.. కేసీఆర్ బీజేపీని ఏవిూ చేయలేరన్నారు.
తమ అవినీతిని దాచిపెట్టేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్నారు. కేసీఆర్ ముఖంలో భయం కనిపిస్తోందని.. ప్రశాంత్ కిషోర్ ఏవిూ చేయలేరన్నారు. ఇదిలావుంటే ఏప్రిల్ 14 నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండో విడత పాదయాత్ర చేపట్టనున్నారు. పార్లమెంట్ సమావేశాలు ముగిశాక సంజయ్ ఈయాత్ర చేయనున్నారు. ఇప్పటికే 36 రోజులపాటు మొదటి విడత పాదయాత్ర సాగింది.రెండో విడతలో 200 రోజులపాటు యాత్ర చేయాలని సంజయ్ నిర్ణయం తీసుకున్నారు. ఐదు విడతలుగా బండి సంజయ్ పాదయాత్ర చేయనున్నారు. కరోనా దృష్ట్యా రెండో విడత యాత్ర ఆలస్యంగా ప్రారంభమవుతుందని బీజేపీ అధిష్ఠానం తెలిపింది. రెండో విడత యాత్రని మహబూబ్‌నగర్ నుంచి ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.