తక్షణం స్పందిస్తున్న బాధితులు
వేధింపులపై ఫిర్యాదులో సత్వరచర్యలుహైదరాబాద్,ఫిబ్రవరి10(జనంసాక్షి): వేధింపులు, ఈవ్‌టీజింగ్ బారిన పడుతున్న వారిలో చాలామంది ఆలస్యంగా ఫిర్యాదు చేస్తుండడంతో సాక్షాలు తారుమారు అవుతున్నాయని పోలీసులు భావిస్తున్నారు. అయితే షీ టీమ్స్వచ్చిన తరవాత పోకిరీలకు చెక్ పెడుతున్నారు. సత్వరం ఫిర్యాదు రాగనే స్పందిస్తున్నారు. తక్షణం స్పందించేలా ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్నారు. ఆకతాయిలు, పోకిరీలు వేధిస్తున్నప్పుడు డయల్ 100కు ఫోన్‌చేస్తే పది నిమిషాల్లో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుంటారు. ఈవ్‌టీజర్లను పట్టుకుని వెళ్తారు. గతంలో బాధితులు ఫోన్ చేయకుండా ’షి’ బృందానికి ఫిర్యాదు చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, వృత్తివిద్య కళాశాలలు, బస్‌స్టాపులు, బస్సు లోపల, వాణిజ్య సముదాయాలు, ఉద్యానవనాలు, దేవాలయాల, మల్టీప్లెక్స్‌ల దగ్గర ఈవ్‌టీజింగ్ కొసాగుతోంది. యువతులు, విద్యార్థినులు ద్విచక్ర వాహనాలు, కార్లలో వెళ్తుంటే వారి వెంటపడి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. అప్పటికప్పుడే బాధితులు స్పందిస్తే పోలీసులకు సంఘటనా స్థలాల్లోనే సాక్ష్యాధారాలు లభిస్తాయి. ఆలస్యంగా ఫిర్యాదు చేస్తే ఆకతాయిలు, పోకిరీల జాడ కనిపెట్టాలి. వారు సంఘటన స్థలంలో ఉన్నట్టు సాక్ష్యాధారాలు సేకరించాలి, దీంతోపాటు మళ్లీ విచారణ పక్రియ మొదలు పెట్టాలంటే రెండు, మూడు రోజులు పడుతుందని ’షి’బృందం బాధ్యులు తెలిపారు. కాలనీలు, జనసంచారం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో వెళ్తుంటే ద్విచక్ర వాహనాలపై వేగంగా వారిపైకి దూసుకొచ్చేలా చేసి భయపెడుతున్నారు. బస్‌స్టాపుల్లో బస్సు ఎక్కే మహిళలు, యువతులను అనుసరించి వారి శరీరాలను ªతాకేందుకు ప్రయత్నిస్తున్నారు. కొందరు యువకులైతే బస్సుల్లో పరోక్షంగా యువతులను ఉద్దేశించి బూతులు మాట్లాడుతున్నారు.