ఆరో రోజుకు చేరిన రెవిన్యూ వీఆర్ఏల నిరహార దీక్ష..


జి.మాడుగుల .ఫిబ్రవరి14. జనం సాక్షి. మండల కేంద్రంలో వీఆర్ఏల నిరాహార దీక్ష సోమవారం నాటికి ఆరు రోజులకు చేరుకుంది . ఈ సందర్భంగా వీఆర్ఏల మండల అధ్యక్షుడు త్రినాథ్ స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 9నుండి 22 వరకు నిరాహారదీక్ష చేసేందుకు రాష్ట్ర యూనియన్ పిలుపునిచ్చారని ఇందులో భాగంగా మా డిమాండ్లకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని. వీఆర్ఏల మండల అధ్యక్షుడు చేడేంగి త్రినాద్ అన్నారు. ప్రభుత్వ 21000 వీఆర్ఏలకు వేతనం ఇవ్వాలని, ఇచ్చిన డి ఎ రికవరీ ఉపసంహరించుకోవాలని, అలాగే నామినీగా పనిచేసే వారందరని విఆర్ఏ  నియమించాలని, అర్హులు అందరికీ ప్రమోషన్ ఇవ్వాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపు చేయాలని, అలాగే 65 సంవత్సరాలు దాటి చనిపోయిన కుటుంబం నకు కంపాసి నేట్ కింద ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, అలాగే వీఆర్ఏ సమస్యలపై సిసిఎల్ఎ అధికారులు రాష్ట్ర కమిటీలో చర్చ జరపాలని. డిమాండ్ లో పేర్కొన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏల డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. ఈ యొక్క నిరాహారదీక్షకు గతంలో జి.మాడుగుల తహసీల్దార్ కార్యాలయంలో అటెండర్ గా పనిచేసి రిటైరయిన తలారి మత్య్సయ్య సంఘీభావం ప్రకటించి నిరాహార దీక్షలో కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో గణపతి, గంగులు, నీలకంఠం, దేవిక, సత్యనారాయణ,మత్య్సమ్మ,సింహాచలం, మోహన్ కుమార్ బాలక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.