మత్తు రహిత జిల్లాయే లక్ష్యం : డీసీపీ రవీందర్


గంజాయ్ నియంత్రణకు సహకరించి సమాజ అభివృద్ధికి తోడ్పాటు అందించాలి

 రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ స్టేషన్  ఆవరణలో రామగుండం పోలీస్ ఆధ్వర్యంలో గంజాయి మత్తు పదార్ధాల నియంత్రణకు స్థానిక కార్పొరేటర్లు ప్రజాప్రతినిధులు, ఆటో యూనియన్, యువత కి అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి పెద్దపల్లి డిసిపి పి.రవీందర్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా డీసీపీ గారు మాట్లాడుతూ.... మత్తు పదార్థాలు సేవించడంతో, యువత, విద్యార్థులు,ప్రజలు అనారోగ్య భారిన పడతారని, అందరి సహకారంతో జిల్లాను డ్రగ్స్, గంజాయి రహితంగా తీర్చిదిద్దుదామని డీసీపీ గారు పిలుపునిచ్చారు.  యువతను వినాశనం వైపు తీసు కెళ్తున్న గంజాయి, డ్రగ్స్ కల్చర్ను నియంత్రణ చేయడం మనందరి బాధ్యత అన్నారు. పట్ట ణాల్లోని మున్సిపల్ చైర్మెన్లు, కౌన్సిలర్లు, గ్రామాల్లోని సర్పంచ్లు, ఎంపీటీసీలు వారి గ్రామాలను గంజాయి, డ్రగ్స్ రహిత గ్రామాలుగా  తీర్చిదిద్దడానికి అందరి బాధ్యత తీసుకోవాలని  పిలుపునిచ్చారు. ఇలాంటి వాటిని సరఫరా, సాగు, సేవించే వారి వివరాలను తెలిసినట్లయితే వెంటనే స్థానిక పోలీసు అధికారులకు తెలియజేయాలని సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. గంజాయి విక్రయించినా, లభించిన వ్యక్తులపై క్రిమినల్, పీడీయాక్టు కేసులు నమోదుచేస్తామని డీసీపీ గారు హెచ్చరిం చారు. విద్యార్థుల ప్రవర్తనను తల్లిదం డ్రులు గమనించాలన్నారు. అనంతరం అందరు ప్రజాప్రతినిధులతో మత్తురహిత ప్రాంతంగా రామగుండం ను తీర్చి దిద్దేందుకు కృషిచేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. గంజాయి నియంత్రణపై అవగాహన వాల్ పోస్టర్ ని డి సి పి, సీఐ,  ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రామగుండం సర్కిల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, రామగుండం ఎస్ఐ సంతోష్ కుమార్,  అంతర్గాం ఎస్ఐ శ్రీధర్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.