మహిళల వన్డే కప్‌లో కీలక మార్పులు


9మంది ఆటగాళ్లతో బరిలోకి దిగేందుకు ఐసిపి అనుమతి

న్యూఢల్లీి,ఫిబ్రవరి24 జనం సాక్షి:  మార్చి 4 నుంచి ప్రారంభంకానున్న మహిళల వన్డే ప్రపంచ కప్‌ 2022కి సంబంధించి ఐసీసీ కీలక నిర్ణయాన్ని వెల్లడిరచింది. కరోనా నేపథ్యంలో మెగా టోర్నీ సజావుగా సాగాలనే ఉద్దేశంతో నిబంధనలు మార్చాలని అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ నిర్ణయించింది. ఏదైనా జట్టులో కరోనా వ్యాప్తి చెందితే, కనీసం 9 మంది ఆటగాళ్లతో బరిలోకి దిగేందుకు ఐసీసీ అనుమతిచ్చింది. అలాగే ప్లేయర్స్‌ను బయో బబుల్స్‌లో ఉంచడం, బంతి బౌండరీ లైన్‌ దాటి వెలుపలకు వెళ్లినప్పుడు శానిటైజ్‌ చేయడం, ఓ ప్లేయర్‌ కరోనా బారిన పడితే జట్టులో ప్రతి ప్లేయర్‌కు కోవిడ్‌ పరీక్షలు నిర్వహించడం వంటి నిబంధనలను యధాతథంగా కొనసాగుతాయని ఐసీసీ ప్రకటించింది. ఇటీవల ముగిసిన అండర్‌`19 ప్రపంచ కప్‌లో టీమిండియా సహా పలు జట్లలో కరోనా కేసులు నమోదై, కనీసం 11 మంది ఆటగాళ్లను బరిలోకి దించలేని పరిస్థితి ఏర్పడిరది. ఓ జ్టటైతే ఆటగాళ్లు అందుబాటులో లేక టోర్నీలో నుంచే వైదొలిగింది. ఈ నేపథ్యంలో ఐసీసీ నిబంధనలను సవరించింది. ఇదిలా ఉంటే, మహిళల వన్డే ప్రపంచకప్‌ 2022కు న్యూజిలాండ్‌ ఆతిధ్యమివ్వనున్న సంగతి తెలిసిందే. బే ఓవల్‌ వేదికగా న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌ మధ్య మ్యాచ్‌తో మెగా టోర్నీ ప్రారంభంకానుంది. మార్చి 6న టీమిండియా.. చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌తో తలపడనుంది. అనంతరం మార్చి 10న న్యూజిలాండ్‌తో, మార్చి 12న వెస్టిండీస్‌తో, మార్చి 16న ఇంగ్లండ్‌తో, మార్చి 19న ఆస్టేల్రియాతో, 22న బంగ్లాదేశ్‌తో, మార్చి 27న దక్షిణాఫ్రికాతో భారత జట్టు తలపడనుంది.
భారత ప్రపంచకప్‌ జట్టు: మిథాలీ రాజ్‌, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, దీప్తి శర్మ, రిచా ఘోష్‌, యాస్తికా భాటియా, స్నేహ రాణా, రaులన్‌ గోస్వామి, మేఘనా సింగ్‌, రేణుకా సింగ్‌ ఠాకూర్‌, తానియా భాటియా, పూజా వస్త్రాకర్‌, రాజేశ్వరి గైక్వాడ్‌