ఘనంగా వీడ్కోలు పలికిన ఉద్యోగులు
హైదరాబాద్,ఫిబ్రవరి28 ( జనం సాక్షి): ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (పీసీసీఎఫ్) ఆర్ శోభ సోమవారం ఉద్యోగ విరమణ పొందారు. అరణ్య భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో అటవీ శాఖ ఉన్నతాధికారులతో పాటు పలువురు ఉద్యోగులు శోభకు వీడ్కొలు పలికారు. కొత్త పీసీసీఎఫ్‌గా రాకేశ్ మోహన్ డోబ్రియల్ నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1988లో అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌గా ఆర్ శోభ విధుల్లో చేరారు. 2019 జూలై 31న పీసీసీఎఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలో ఫారెస్ట్ ఫోర్స్‌కు నాయకత్వం వహించిన మొదటి ఐఎఫ్‌ఎస్ అధికారిగా గుర్తింపు పొందారు. సీఎం కేసీఆర్ సూచనలతో రాష్ట్రంలో అడవుల రక్షణ, అటవీ పునరుజ్జీవం, హరితహారం వంటి కార్యక్రమాలను సమర్థంగా నిర్వహించారు.
ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ పదవీవిరమణ