సిక్స్‌ప్యాక్‌లో విజయం దేరకొండ

 


( జనం సాక్షి): 

సెన్సేషనల్‌ స్టార్‌ హీరో విజయ్‌ దేవరకొండ త్వరలో ’లైగర్‌’గా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం
తెలిసిందే. డాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ బాక్సర్‌ గా కనిపించబోతున్నాడు. ఈ సినిమా కోసం విజయ్‌ రింగుల జుట్టుతో, సిక్స్‌ ప్యాక్‌ బాడీతో బాక్సర్‌ మేకోవర్‌ లో కన్పించి అభిమానులను ఆకట్టుకున్నాడు. గత రెండేళ్లుగా ఒకే స్టైల్‌ ను మెయింటైన్‌ చేస్తూ వస్తున్న ఈ యంగ్‌ హీరో ఇప్పుడు సరికొత్త లుక్‌ లో మరింత హ్యాండ్సమ్‌ గా కన్పించాడు. టాలీవుడ్‌ హ్యాండ్సమ్‌ హంక్‌ విజయ్‌ దేవరకొండ ’లైగర్‌’ కోసం ఇన్నాళ్లూ పొడవాటి జుట్టుతో కన్పించిన విషయం తెలిసిందే. తాజాగా ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌ కోసం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో విజయ్‌ కనిపించాడు. ఆ ఫోటో కాస్తా వైరల్‌ కావడంతో ఆయన కొత్త లుక్‌ అందరి దృష్టిని ఆకర్షించింది. దాదాపు రెండేళ్ల తర్వాత విజయ్‌ తన అభిమానులను కొత్త అవతార్‌తో ట్రీట్‌ చేశాడు.
తల్లి మాధవితో కలిసి ఆయన వాలీబాల్‌ మ్యాచ్‌ను ఆస్వాదిస్తున్నాడు. విజయ్‌ దేవరకొండ న్యూ లుక్‌ ను చూసిన నెటిజన్లు తన నెక్ట్స్‌ మూవీ జన గణ మన కోసమే ఈ మేకోవర్‌ అంటున్నారు. పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో విజయ్‌ నటించిన పాన్‌ ఇండియా మూవీ ’లైగర్‌’ ఆగస్టు 25న విడుదల కానుంది. ఈ సినిమాలో మైక్‌ టైసన్‌ కీలకపాత్రలో, అనన్య పాండే కథానాయికగా కనిపించనుంది.