ప్రజలంతా బానిసలుగా ఉండాలన్న అహంకారం
రాజ్యాంగాన్ని మారన్చాలన్న కుట్రలో భాగమే
హుజూరాబాద్ ఓటమి తరవాత మతిభ్రమించిన మాటలు
ఎరువుల సబ్సిడీని కొనసాగిస్తూనే ఉన్నాం
సర్జికల్ స్టయ్రిక్స్‌పై కెసిఆర్ సర్టిఫికెట్ అవసరం లేదు
మోడీ ఏడేళ్ల పాలనపై బహిరంగ చర్చకు సిద్దంగా ఉన్నాం
విూడియా సమావేశంలో కెసిఆర్‌కు సవాల్ విసిరిన కిషన్ రెడ్డి
హైదరాబాద్,ఫిబ్రవరి15 ( జనం సాక్షి): తెలంగాణలో టీఆర్‌ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా నేతల మధ్య మాటల తూటాలు పేలతున్నాయి. టీఆర్‌ఎస్ నేతలు బీజేపీ నాయకులపై విమర్శలు చేస్తుంటే.. అది కూడా డైరెక్టుగా సీఎం కేసీఆర్ రంగంలోకి దిగి బీజేపిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. దీంతో బీజేపీ నేతలు సైతం టీఆర్‌ఎస్ అధినేతతో సహా నేతలకు కౌంటర్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. హుజురాబాద్‌లో నన్ను ఓడిస్తారా అని అహంకారపూరితంగా కేసీఆర్ వ్యవహ రిస్తున్నారని ఆయన విమర్శించారు. కేసీఆర్ కుటుంబానికి ఉద్యమకారులతో సహా అందరూ బానిసలు గానే ఉండాలి తప్ప.. ఎదురు మాట్లాడకూడదన్న ధోరణిలో ఉన్నారని ఆయన మండిపడ్డారు. సీఎంగా కేసీఆర్ తీరు దిగజారుడుగా దివాళాతనంగా ఉందని ఆయన అన్నారు. అబద్దాలు మాట్లాడడం, భయపెట్టడం, రాజ్యాంగానికి విరుద్ధంగా హింసను ప్రేరేపిస్తున్నారు.. అధికార దుర్వినియోగానికి ఇది అద్దం పడుతోందని ఆయన ఆరోపించారు. మంగళవారం నాడాయన విూడడియాతో మాట్లాడుతూ..
కేసీఆర్ మాట్లాడినట్టు పాకిస్తాన్ కూడా మాట్లాడలేదని, బీజేపీకి, కేంద్రానికి శత్రువులు ఎవరు లేరు.. కేవలం ప్రత్యర్థులు మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. పాకిస్థాన్ మాత్రం శత్రువేనని ఆయన అన్నారు. సర్జికల్ స్టయ్రిక్స్‌ను ప్రశ్నించడం ద్వారా ఆర్మీని అవమానించారని మండిపడ్డారు. సిఎం కేసీఆర్ వ్యవహార శైలి తెలంగాణ సమాజం అసహ్యించుకునేలా ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఇంత దిగజారుతాడా.. అని ప్రజలు ముక్కున వేలు వేసుకుంటున్నారన్నారు. ముఖ్యమంత్రి పదవి స్థాయిని తగ్గించే విధంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారన్నారు. తనను ప్రశ్నించే వాళ్లు ఉండకూడదని కేసీఆర్ భావిస్తున్నారన్నారు. హుజురాబాద్ ఫలితాలతో కేసీఆర్‌కు భయం పట్టుకుందన్నారు. ఎవరు వ్యతిరేకించినా కేసీఆర్ సహించడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్ చెప్పేవన్నీ అబద్దాలేనని అన్నారు. మోడీని అవమానించేలా కేసీఆర్ మాటలు ఉన్నాయన్నారు. కేసీఆర్ దిగజారి మాట్లాడుతున్నా రన్నారు. టీఆర్‌ఎస్,కేసీఆర్ వాడే భాషలో తాము మాట్లాడలేమన్నారు. సైన్యం ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా కేసీఆర్ మాటలున్నాయన్నారు.. నిజాం పరిపాలనలా రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటు న్నాడన్నారు. గత ఏడున్నర సంవత్సరాలుగా మోడీ ఏం చేయలేదని కేసీఆర్ అన్నారని... మోడీ ఏం చేశారో తాము చర్చకు సిద్ధమన్నారు. అమరవీరుల స్థూపం దగ్గర విూడియా ముందు కేసీఆర్‌తో చర్చించేందకు సిద్ధంగా ఉన్నామన్నారు. కానీ ప్రజలు మాట్లాడే భాషతోనే చర్చకు సిద్ధమన్నారు. మా పార్టీకి దేశమే ముఖ్యం..వ్యక్తులు కానీ కుటుంబాలు కానీ ముఖ్యం కాదన్నారు. టీఆర్‌ఎస్‌కు కుటుంబం, అధికారం ముఖ్యం అని అన్నారు. బీజేపీని తరిమికొట్టే శక్తి ఈ భూ ప్రపంచంలోనే ఎవరికీ లేదన్నారు. తెలంగాణ నిర్ణయాలన్నీ కేసీఆర్ డైనింగ్ టేబుల్‌పై జరుగుతాయి కానీ కేబినెట్‌లో కాదన్నారు. సర్జికల్
స్టైక్స్ పై కేసీఆర్ సర్టిఫికెట్ అవసరం లేదన్నారు. పాకిస్తాన్‌లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన యుద్ధ వీరుడు అభినందన్ పట్టుపడితే 24 గంటల్లో ఇండియాకు రప్పించామన్నారు. కొన్ని సంఘటనలు జరిగితే చేతులు ముడుచుకుని కూర్చోబోమన్నారు. బోర్ల దగ్గర విూటర్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు. పెట్టాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి కూడా లేదన్నారు. కేసీఆర్ తన రాజకీయ లబ్ది కోసమే అవాస్తవాలు మాట్లాడుతున్నారన్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. యూరియా విూద వందకు వంద శాతం సబ్సిడీ ఇస్తున్నామన్నారు. త్వరలోనే రామగుండం యూరియా ఫ్యాక్టరీని నరేంద్ర మోడీ ప్రారంభి స్తారన్నారు. ముఖ్యమంత్రే హింసకు` దాడులకు దిగడం కొత్తగా చూస్తున్నామన్నారు. బడ్జెట్, కేంద్రం, మోడీపై సీఎం కేసీఆర్ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ఇదే సమయంలో విద్యుత్ సంస్కరణలపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కామెంట్స్‌పై తీవ్రంగా స్పందించారు. ఫ్రీ కరెంట్ రైతులకే కాదు.. అన్ని వర్గాల వారికి ఫ్రీ గా ఇచ్చినా బీజేపీకి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. మోటర్లకు విూటర్లు పెట్టాలని ఏ రాష్టాన్రికి కేంద్రం ఆదేశాలు ఇవ్వలేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మోటర్లకు విూటర్లు పెట్టాలనే ఆలోచన కేంద్రానికి లేదన్నారు. యూరియా సబ్సిడీ గత ఏడాది రూ. 79 వేల కోట్లు ఉంటే.. ఈ ఏడాది 1లక్ష కోట్లు పెట్టామని ప్రకటించారు. అంటే గతంతో పోల్చితే ఈ సారి 30శాతానికి పైగా సబ్సిడీ పెంచామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివరించారు. భారత రాజ్యాంగంను ప్రపంచం అంతా పొగడని దేశం ఉండదన్నారు. ఇండియా అంటే ఇందిరా అనే నినాదాన్ని రాజ్యాంగం ద్వారనే ఓడిరచారని తెలిపారు. రాజ్యాంగ హక్కు వల్లనే హుజురాబాద్‌లో కేసీఆర్ ఓడిపోయారని అందుకే రాజ్యాంగం మారాలని అంటున్నారని మండిపడ్డారు. బీజేపీకి నడ్డా తరువాత ఎవరు అధ్యక్షుడు అవుతారో ఎవరూ చెప్పలేరని... కానీ టీఆర్‌ఎస్ పార్టీకి కేసీఆర్ తరువాత కేటీఆర్ అధ్యక్షుడు అవుతారన్నారు. బెంగాల్‌లో ఏం జరుగు తుందో తెలుసా కేసీఆర్ అని ప్రశ్నించారు. గత ఏడేళ్లుగా మతకలహాలు లేవని... బాంబ్ పేలుళ్లు లేవని, కర్ఫ్యూలు లేవన్నారు. ఈశాన్య రాష్టాల్ల్రో నెలల పాటు రోడ్లన్నీ మూసివేసి ఉండేవని అన్నారు. ఈశాన్య రాష్టాల్ర శాంతితో ముందుకు వెళ్తున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.