( జనం సాక్షి):
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన ’పృథ్వీరాజ్’ చిత్రానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను ఢల్లీి హైకోర్టు తిరస్కరించింది. పిటిషన్‌ను స్వీకరించేందుకు న్యాయస్థానం నిరాకరించింది. పృథ్వీరాజ్ చౌహాన్ గొప్ప చక్రవర్తి అని, సినిమా టైటిల్‌ను ’పృథ్వీరాజ్’ అని మాత్రమే ఉంచడం సమాజంలోని పెద్ద వర్గాల మనోభావాలను దెబ్బతీస్తుందని పిటిషనర్ పేర్కొన్నారు. సినిమా టైటిల్ ను ’మహా చక్రవర్తి పృథ్వీరాజ్ చౌహాన్’గా మార్చాలని విజ్ఞప్తి చేశారు. అయితే పిటిషన్ పై విచారణ చేపట్టేందుకు కోర్టు ఆసక్తి చూపించలేదు. కాగా, పృథ్వీరాజ్ మూవీ టీజర్ ను మేకర్స్ ఇప్పటికే విడుదల చేశారు. చంద్రప్రకాష్ ద్వివేది దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంజయ్ దత్, అశుతోష్ రాణా, సోనూ సూద్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇక మిస్ వరల్డ్ 2017 మానుషి చిల్లర్ ఈ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.
పృథ్వీరాజ్ చిత్రంపై పిటిషన్ తిరస్కరణ