బడ్జెట్ కేటాయింపులపై మంత్రి గంగుల సవిూక్ష
టైలర్స్ డే సందర్బంగా శుభాకంక్షలు
హైదరాబాద్,ఫిబ్రవరి28 ( జనం సాక్షి): 2022`23 ఆర్థిక సంవత్సర రాష్ట్ర బడ్జెట్లో బీసీ సంక్షేమ శాఖకు అవసరమైన నిధుల కోసం చేయాల్సిన ప్రతిపాదనలపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఉన్నతస్థాయి సవిూక్ష నిర్వహించారు. ఇదివరకే శాఖాపరంగా అవసరమున్న నిధులపై అధికారులకు సూచనలు, ఆదేశాలు జారీ చేసిన మంత్రి సోమవారం ఖైరతాబాద్‌లోని తన కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఇతర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. మహాత్మా జ్యోతిబాపూలే గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు, ఎంబీసీ, బీసీ కార్పొరేషన్ లు, బీసీ ఫెడరేషన్ లు, కల్యాణ లక్ష్మి, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఆత్మగౌరవ భవనాలు, తదితర అమలవుతున్న బీసీ సంక్షేమ, అభివృద్ధి, కార్యక్రమాలకు సంబంధించి వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక శాఖకు సమర్పించాల్సిన బ్జడెట్ పై కసరత్తు నిర్వహించారు. నిర్వహణ, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పటిష్టంగా నిర్వహించేలా బ్జడెట్ ప్రతిపాదనలు రూపొందించామని మంత్రి గంగుల తెలిపారు. కార్యక్రమంలో బీసీ కార్పోరేషన్ ఎండి, మహాత్మాజ్యోతిబాపూలే గురుకులాల కార్యదర్శి
మల్లయ్యబట్టు, బీసీ స్టడీసర్కిల్ ఎండీ అలోక్ కుమార్, వ్డడెర ఫెడరేషన్ ఎండీ బాలాచారి, రజక ఫెడరేషన్ ఎండీ చంద్రశేఖర్, నాయీబ్రాహ్మణ పెడరేషన్ ఎండీ విమలాదేవి బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇదిలావుంటే బీసీల ఉన్నతి కోసం కేసీఆర్ సర్కార్ విశేష కృషి చేస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. రవీంద్రభారతిలో తెలంగాణ మేరు సంఘం నిర్వహించిన ప్రపంచ టైలర్స్ డే వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ.. నేతన్న నేసిన వస్త్రాన్ని మనిషికి తగ్గట్టు అందంగా మలిచేది దర్జీలని, వారు కుట్టిన బట్టలతోనే హుందాతనం వస్తుందన్నారు. విలియమ్స్ హౌవో పిభ్రవరి 28న కుట్టుమిషన్ కనుగొన్న సందర్భంగా టైలర్లందరికీ గుర్తుంపు లభించిందన్నారు. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చేయని విధంగా మేరు కులస్తులకు హైదరాబాద్ అత్యంత విలువైన ఉప్పల్ భగాయత్‌లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎకరా స్థలంతో పాటు కోటి రూపాయలు కేటాయించిందన్నారు. బీసీల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఉన్నత వర్గాలకు దీటుగా బీసీ గురుకులాల్లో విద్యను అందిస్తున్నామన్నామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో మంత్రి గంగులతో పాటు బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు రావు, మేరు సంఘం తెలంగాణ అధ్యక్షుడు కీర్తి ప్రభాకర్, నేతలు దీకొండ నర్సింగరావు, వెంకటేష్ తధితరులు పాల్గొన్నారు.