భూ సమస్యలను పరిష్కరించాలని కోరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు




ఇబ్రహీంపట్నం,ఫిబ్రవరి 8 (జనంసాక్షి): ఇబ్రహీంపట్నం నియోజకవవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్రి నిరంజన్ రెడ్డిని ఆరుట్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం కలిశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ..ధరణి పోర్టల్ లో నెలకొని ఉన్న భూ సమస్యలను పరిష్కరించేల చూడాలని మర్రి నిరంజన్ రెడ్డికి విన్నవించారు. అనంతరం ఆరుట్లలో వేణుగోపాల జాతర సందర్బంగా యువజన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న క్రికెట్ టోర్నమెంటుకు నిరంజన్ రెడ్డిని యువజన కాంగ్రెస్ నాయకులు ఆహ్వానించారు. కార్యక్రమంలో నూకం సుధాకర్, దాసరమోని రమేష్, ఎస్సి సెల్ అధ్యక్షులు బుగ్గరాములు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అశోక్, శ్రీనివాస్, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.