50 తులాల ఆభరణాలు, 10,వేల నగదు స్వాధీనం
వెస్ట్‌జోన్ డీసీపీ జోయెల్ డెవీస్ వెల్లడిహైదరాబాద్,ఫిబ్రవరి26(జనం సాక్షి ): నగరంలోని పలుచోట్ల చోరీలకు పాల్పడుతున్న నలుగురు దొంగలను అరెస్ట్ చేసినట్లు వెస్ట్‌జోన్ డీసీపీ జోయెల్ డెవీస్ తెలిపారు. మాసబ్‌ట్యాంక్‌లోని వెస్ట్ జోన్ డీసీపీ కార్యాలయంలో విూడియా సమావేశంలో ఆయన వివరాలను వెల్లడిరచారు. హుమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు ఇండ్లలో చోరీలకు పాల్పదుతున్న నలుగురు నిందితులను అదపులోకి
తీసుకున్నామన్నారు. నిందితుల నుంచి 50 తులాల బంగారు ఆభరణాలు, 10,వేల నగదు, ఓ ద్విచక్ర వాహనం డియో బైక్, మొత్తం రూ. 26 లక్షలు సొత్తును సీజ్ చేసామన్నారు. మంగల్‌హట్, హుమాయున్ నగర్, ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నిందితులు దొంగతనాలకు పాల్పడ్డారని ఆయన తెలిపారు. పట్టుబడిన వారిలో ఇద్దరు బాలురు, ఇద్దరు యువకులు ఉన్నారన్నారు. తమకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు వారిపై హుమాయున్ నగర్ పోలీసులు నిఘా పెట్టారన్నారు. ఆసిఫ్ నగర్ డివిజన్, వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులతో కలిసి సంయుక్తంగా నిందితులను పట్టుకున్నారని ఆయన తెలిపారు. వీరిలో ఇద్దరు పేరుమోసిన ఇంటి దొంగలు ఉన్నారన్నారు.