కర్నూలు,ఫిబ్రవరి28 ( జనం సాక్షి): కోవిడ్ నిబంధనల నేపథ్యంలో శివరాత్రిని పురస్కరించుకొని యాగంటి క్షేత్రం ఉమామహేశ్వరస్వామి బ్రహ్మాత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈవో డీఆర్‌కేవీ ప్రసాద్ తెలిపారు. క్యూలైన్ల వెంట చలువ పందిళ్లు, అవసరమైన చోట శామియానాలు, లైటింగ్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. దాతల సహకారంతో రూ.1లక్ష విలువ చేసే మజ్జిగ పాకెట్లను భక్తులకు అందించనున్నట్లు
తెలిపారు. వివిధ ప్రాంతాలనుంచి వచ్చే భక్తులు వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేశామన్నారు. ఆలయంలో శానిటైజేషన్ పూర్తి చేసి అవసరమైన చోట టస్ట్‌బిన్‌లు ఏర్పాటు చేశామన్నారు. భక్తుల స్నానాల కోసం ప్రత్యేక ట్యాంకులు, కొళ్ళాయి సౌకర్యం ఏర్పాటు చేశామన్నారు. టంగుటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో అవసరమైన భక్తులకు ఉచితంగా మందులు పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేశామన్నారు.
యాగంటిలో శివరాత్రి ఏర్పాట్లు