నిర్మల్: వసంత పంచమిని పురస్కరించుకొని ప్రముఖ దేవాలయమైన బాసర జ్ఞాన సరస్వతి ఆలయం భక్తులతో రద్దీగా మారింది. అర్ధరాత్రి నుంచి సుదూర ప్రాంతాలకు చెందిన భక్తులు ఆలయానికి చేరుకొని అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లలో బారులుదీరారు. తెల్లవారుజామున 2 గంటలకు అభిషేకంతో ఈ ఉత్సవానికి అంకురార్పణ చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి వచ్చి అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసం పూజలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున అమ్మవారికి దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.