నిత్యం సేద్యమే
అతడికి పెద్ద వ్యసనం
ద్యాసంతా పంట పైనే
విత్తు నాటిన నాటిన నుండి
చేతికి పంట వచ్చే వరకు
రేయం బవళ్లు కంటికి రెప్పలా
కాపాడుకుంటాడు
వెన్నెలై మురిసిపోతాడు
పసిపాపై పర్వ సిస్తాడు
స్వంత పాపాపాయిలా
చూసుకుంటాడు
రెక్కలు ముక్కలు
చేసుకుంటాడు
చెమట చుక్కలు పారిస్తాడు
బురద పూలు పూయిస్తాడు
తలో కాంత ముద్ద పెడతాడు
అన్నం దేవుడు అతడు
గాదిరాజు రంగరాజు
చెరుకువాడ