విజయవాడలో దీక్షకు దిగిన హైకోర్టు న్యాయవాది శ్రవణ్ కుమార్
విజయవాడ,ఫిబ్రవరి26(జనం సాక్షి): ఏపీ ప్రభుత్వం రద్దు చేసిన ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాలను ప్రారంభించాలని మాజీ జడ్జి, హైకోర్టు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ శనివారం దీక్ష చేపట్టారు. విజయవాడ ధర్నా చౌక్‌లో ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ఆయన విూడియాతో మాట్లాడుతూ.. సబ్ ప్లాన్ నిధులను నవరత్నాలకు బదిలీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా ఇచ్చిన నిధులను సబ్ ప్లాన్ నిధులలో కలిపి చూపించడం చట్టవిరుద్దమని శ్రవణ్ కుమార్ చెప్పారు. అనంతరం మాల మహాసభ వ్యవస్థాపక అధ్యక్షుడు మ్లలెల వెంకట్రావ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని గెలిపించేందుకు తాను రాష్ట్రం అంత పర్యటించనని, ఇక దించడానికి తిరుగుతానని తెలిపారు. సబ్ ఎª`లాన్ నిధులు ఎవ్వరికీ అందడం లేదన్నారు. గత రెండేళ్ల జగన్ పాలనలో ఎస్సీ, ఎస్టీలకు తీరని అన్యాయం జరిగిందని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను కూడా వైసీపీ ప్రభుత్వం దారి మళ్లిస్తుందని మ్లలెల వెంకట్రావ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సబ్‌ప్లాన్ నిధులు నవరత్నాలకు ఎలా మళ్లిస్తారు