జనంసాక్షి వార్తలకు స్పందించిన అధికారులు


వేములపూడి పంచాయితీ పారిశుద్ధ్య కార్మికుల  సమ్మె పై స్పందించిన అధికారులు

ప్రభుత్వం నుండి జీతాలు వచ్చే వరకు జనరల్ ఫండ్ నుండి ఒక్కకరి 20 వేలు 

సమ్మె విరమించి విధుల్లోకి చేరిన పారిశుద్ధ్య కార్మికులు

నర్సీపట్నం ఫిబ్రవరి 14 (జనంసాక్షి) :

నర్సీపట్నం మండలం వేములపూడి పంచాయతీ కార్మికులు తమకు రావాల్సిన 11 నెలలు జీతాల కోసం సీఐటీయూ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ప్రసన్న ఆధ్వర్యంలో 5 రోజులుగా సమ్మె బాట పట్టారు. దీనిపై జనంసాక్షి వార్తాపత్రికలో వార్తలు ప్రచురించడం జరిగింది. దీనిపై సోమవారం పంచాయతీ అధికారులు స్పందించారు. పంచాయితీ గ్రేడ్ 1 సెక్రటరీ బి సత్యనారాయణ విలేకరికి తెలిపిన వివరాలు ప్రకారం ప్రభుత్వం నుండి జీతాలు వచ్చే వరకు పంచాయతీ జనరల్ ఫండ్ నుండి పారిశుద్ధ్య కార్మికులకు ఒక్కొక్కరికి 20 వేల రూపాయలు ఇవ్వడానికి తీర్మానం చెయ్యడం జరిగిందన్నారు. దీనిపై పారిశుద్ధ్య కార్మికులకు తెలియచేయడం జరిగిందన్నారు. దానికి వారు అంగీకరించి సమ్మెను విరమించి విధుల్లోకి చేరినట్లు తెలిపారు.