అప్రమత్తంగా,ధైర్యంగా ఉండాలని హితవు
వారికి అండగా టిడిపి ఉంటుందని హావిూఅమరావతి,ఫిబ్రవరి25 (జనంసాక్షి): ఉక్రెయిన్‌లోని తెలుగు విద్యార్థులతో జూమ్ ద్వారా టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులకు చంద్రబాబు ధైర్యం చెప్పారు. తెలుగు విద్యార్థులంతా ఐక్యంగా, తటస్థంగా ఉండటం ఎంతో మంచిదని సూచించారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సమయస్ఫూర్తితో వ్యవహరించడం ఎంతో కీలకమన్నారు. పాస్‌పోర్ట్ సహా ఇతర ఆధారాలు ఎప్పుడూ వెంటే ఉంచుకోవాలని సూచించారు. టీడీపీ ఎన్‌ఆర్‌ఐ సెల్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ.. మిమ్మల్ని సురక్షితంగా తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటుందని చెప్పారు. రాబోయే 2`3 రోజులు ఎంతో కీలకమని, పూర్తి అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. భీకర పోరు జరుగుతున్న ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన తెలుగు వారందరికీ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ సెల్ మద్దతు ప్రకటించింది. వారికి సహాయం చేయడానికి ప్రత్యేకంగా సహాయ కేంద్రాలను నెలకొ?ల్పినట్లు పార్టీ యువ నాయకుడు నారా లోకేష్ తెలిపారు. ఔఖీఎ ªుఆఖ సెల్ హాట్‌లైన్ 91 8645350888కి కాల్ చేయవచ్చని, లేదా ఇమెయిల్ చేయవచ్చని వారు కోరారు. దేశంలోని తల్లిదండ్రుల సంప్రదింపు వివరాలను 91 8950674837కు చేయవచ్చని లోకేష్ తెలిపారు.