ములుగు,ఫిబ్రవరి10(జనం సాక్షి):-
ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురంలో 133/33&11కెవి సబ్ స్టేషన్ సమీపంలో గురువారం ఉదయం ఏటూరునాగారం నుండి మంగపేట వెళ్తున్న టిప్పర్ లారీ బైక్ ను డీ కొట్టి అదుపు కాక రోడ్డు ప్రక్కనే ఉన్న చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒక్కరు అక్కడికక్కడే మృతి చెందగా ఒక్కరి పరిస్థితి విషమంగా ఉంది. వీరు కమలాపురం గ్రామానికి చెందిన వారిగా తెలిసింది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.