ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి 8 (జనం సాక్షి) మంచాల మండలంలోని నోముల గ్రామానికి చెందిన మంచాల మండల కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సమక్షంలో చేరిక నాగరాజు మాట్లాడుతూ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై టిఆర్ఎస్ పార్టీలో చేరినట్లు తెలిపారు,కాంగ్రెస్ పార్టీలో ఎంత కష్టపడిన సముచితమైన స్థానం లేదని అన్నారు,నాగరాజుతో పాటుగా పల్నాటి మల్లేష్,నల్ల శ్రీకాంత్ మరియు ఇరవై మంది యువకులతో తెరాస పార్టీ జిల్లా అధ్యక్షులు,ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరినట్లు తెలియజేసారు.