జూలూరుపాడు, ఫిబ్రవరి 3, జనంసాక్షి: ఆర్య వైశ్యుల ఆరాధ్య దైవం, కులదేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమాన్ని గురువారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య కళ్యాణ మండపము నందు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు చే
శారు. 19 రకాల ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించి ప్రసాద వితరణ చేశారు. మండపం వద్ద గోత్ర నామాలకు అనుగుణంగా ఒత్తులు వెలిగించి అమ్మ వారిని స్మరించుకుంటూ గీతాలాపన, భజనలు చేశారు. జూలూరుపాడు మండల ఆర్యవైశ్య సంఘం, పట్టణ ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళా సంఘం జిల్లా నాయకురాలు తొండెపు నాగమణి, పెండ్యాల కల్పన, మండల ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు పెండ్యాల నదియా, తొండెపు సరిత, కోశాధికారి కురువెల్ల సంధ్యారాణి, మహిళలు, సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.