జనంసాక్షి ప్రత్యేక కథనం .... పాపం బలి"పశువులు"




అక్రమంగా కలేభరాలకు తరలిపోతున్న పశు సంపద.


మన్యంలో ప్రతి నెల కోట్లలోవ్యాపారం....


నిఘా పెట్టని పోలీసు శాఖ...


ఆమ్యామ్యా లతో మౌనం వహిస్తున్న అధికారులు...


గోసంరక్షణ చట్టానికి భారీగా తూట్లు.


అరకులోయ,ఫిబ్రవరి 12(జనం సాక్షి): మన్యంలో మూగజీవాలు అక్రమ రవాణా  జోరుగా సాగుతుంది.గత కొన్నేళ్లుగా అరకువేలి నియోజకవర్గ పరిధిలోని డుంబ్రిగూడ మండలం కొర్రాయి, కొర్రాయి కొత్తవలస గ్రామం పరిసరాల ప్రాంతం నుండి పశువుల రవాణా నిరాటంకంగా జరుగుతుంది.వివిధ ప్రాంతాల నుండి పశువ్యాపారం చేసే బడా వ్యాపారులు ఏజెన్సీ ప్రాంతంలో మకాంవేసి అక్కడ కొంత మందిని తమ అనుకూలంగా మార్చుకొని పశువులను కొనుగోలు చేస్తూ అక్రమంగా పశు కలేబరాలకు తరలిస్తున్నారు.ఒడిస్సా పరిసర ప్రాంతం నుండి ఆవులు కొనుగోలు చేసికు కొర్రాయి గ్రామ సమీపంలో పశువుల అన్నిటిని ఒక దగ్గరకు చేర్చి రాత్రివేళల్లో పశువుల వ్యాపారులు అక్రమంగా పసువు కళేబరాలకు తరలిస్తున్నారు.ఇందుకు కొంతమంది స్థానికులు కూడా సహకారం అందిస్తూ ఉండడంతో పశువులు బడా అక్రమ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది.ప్రతి గురువారము, శుక్రవారం ఒరిస్సా పరిసర ప్రాంతంలో పశువులు కొనుగోలు చేసి గురు, శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ లారీలలో వ్యాపారులు పశువులను అక్రమంగా తరలించుకుపోతున్నారు.గత కొద్ది సంవత్సరాలుగా ఈ పశు అక్రమ వ్యాపారం రహస్యంగా జోరుగా సాగుతున్న అధికారులు పట్టించుకోకపోవడం,పోలీసులు నిఘా పెట్టకపోవడం పై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.గోసంరక్షణ చట్టాన్ని పరి రక్షించవలసిన సంబంధిత అధికారులు గో వధను ప్రోత్సహిస్తున్నారని విమర్శలు కూడా ఈ ప్రాంతంలో వెల్లువెత్తుతున్నాయి.గత కొన్ని నెలలుగా అక్రమ పశువుల వ్యాపారం జోరుగా సాగుతున్న అధికారులు ఎందుకు పట్టించుకోక పోవడం లేదని అక్రమ పశు వ్యాపారులపై ఎందుకు కేసులు నమోదు చేయడం లేదని పలువురు చర్చించుకుంటున్నారు.అక్రమ పశు వ్యాపారులతో అధికారులు కుమ్మక్కు అవడం వల్లనే పశు వ్యాపారం దర్జాగా జోరుగా సాగుతుందని ఈ ప్రాంత ప్రజలు చెప్పుకుంటున్నారు.రాత్రివేళ కాకుండా కొన్ని సందర్భాల్లో వేకువజామున కూడా పశువుల అక్రమంగా తరలిపోతున్న అధికారులు ఎక్కడ అడ్డుకట్ట వేయకపోవడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి.సంబంధిత అధికారులు నెలవారి మామూలు ముందుగా మాట్లాడు కోవడం వలన బడా వ్యాపారులు ఎటువంటి భయం లేకుండా చీకూచింతా లేకుండా వ్యాపారాన్ని దర్జాగా కొనసాగిస్తున్నారని దీనిపై బాహాటంగానే ఆరోపణలు వినిపిస్తున్నాయి.కళ్ళముందే అక్రమ పశువు వ్యాపారం జరుగుతున్న ఫిర్యాదు చేయలేని స్థితిలో కొంతమంది ఉంటున్నారు.వ్యాపారులకు భయపడి అలాగే మామూలు తీసుకుంటున్న అధికారులు రివర్స్ లో తమపై ఎలా ఏవిధంగా కేసులో ఇరికిస్తారని భయంతో పలువురు మౌనంగా ఉండి పోతున్నారు. ప్రతి నెలలో ఈ అక్రమ పశువు వ్యాపారం కోట్లాది రూపాయలలో జరుగుతున్నట్లు లక్షలాది రూపాయలు అనేక మంది చేతులు మారుతున్నట్లు తెలుస్తుంది.కొర్రాయి గ్రామ సమీపంలోనే  కాకుండా కించుమండ సమీపంలో నుండి కూడా అప్పుడప్పుడు పశు అక్రమ రవాణా రహస్యంగా జరుగుతున్నట్లు సమాచారం. పశువు అక్రమ వ్యాపారాన్ని ఎటువంటి ఆటంకాలు లేకుండా పసుపు వ్యాపార సూత్రధారి కీలక పాత్ర పోషిస్తూ అరకులోయ ప్రాంతం నుండి పాడేరు మీదుగా పలు ప్రాంతంలో ఉన్న పశు కలేబరాలకు పశువులు దర్జాగా తరలిపోవడానికి ఈ కీలక సూత్రధారి ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తుంది.ఈ కీలక సూత్రధారి అధికారులకు మామూలు చెల్లిస్తూ ఎక్కడికక్కడ పశువు అక్రమ రవాణా వాహనాలకు అడ్డంకులు లేకుండా దర్జాగా పశు కలేబరాలకు తరలి వెళ్తున్న చూస్తున్నారని ఇక్కడ గుసగుసలు బలంగా వినిపిస్తున్నాయి. ఆ కీలక సూత్రధారి అన్ని శాఖల అధికారులను గుప్పెట్లో పెట్టుకున్నట్లు కథనం వినిపిస్తుంది. ఈ కథనాల వెనుక నిజానిజాలు ఎలా ఉన్నా మండలం కొర్రాయి ప్రాంతాలనుండి ప్రతివారం అక్రమంగా పశు వ్యాపారం జరుగుతుందని చెప్పక తప్పదు.గోవులను దేవుళ్ళుగా పూజించే మన దేశంలో గోవులు అక్రమంగా తరలించి తీసుకువెళ్లి గోవ్యధ చేస్తున్న ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవడం లేదోతెలియడం లేదని గోసంరక్షణ ప్రేమికులు వాపోతున్నారు.ఇది ఇలా ఉండగా పశువుల అక్రమ వ్యాపారులు తమ అక్రమ వ్యాపారం కాకుండా ఉండేందుకు ఎవరైనా గోసంరక్షణ ప్రేమికులు ప్రశ్నిస్తే తాము గోసంరక్షణ కేంద్రాలకు తీసుకు వెళ్తున్నామని అక్క గోవులను బాగా చూసుకుంటున్నా మని సమాధానం చెప్పడం కొసమెరుపు.అయితే ఈ బడా వ్యాపారులు పశువులను ఏఏ గోసంరక్షణ కేంద్రాలకు తీసుకువెళుతున్నారు పేర్లు చెప్పకపోవడం గమనార్హం.వాస్తవంగా ఆలోచిస్తే ఇక్కడ నుండి పశువులు హైదరాబాద్ కాకినాడ రాజమండ్రి వంటి ప్రాంతాల పశువు కళేబరాలకు తరలి పోతున్న ట్లు తెలుస్తోంది.ఇప్పటికైనా సంభందిత ఉన్నతాధికారులు,గోసంరక్షణ సాధకులు స్థానిక అధికారులు ,పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ స్పందించి అక్రమ పశువు రవాణా వ్యాపారని అరికట్టాలని పశుసంపదను సంరక్షించాలని ఈప్రాంత ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే అక్రమ వ్యాపారం సాగిస్తున్న బడా వ్యాపారులుపై కఠిన చర్యలు తీసుకోవాలని కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ పశువుల తరలింపు పై అధికారులు దృష్టిసారించి అడ్డుకట్ట వేస్తారో లేదో వేచి చూడాల్సిందే..