హైదరాబాద్,ఫిబ్రవరి28(ఆర్‌ఎన్‌ఎ): మహాశివుణ్ణి ఆరాధించే పవిత్రమైన రోజు మహాశివరాత్రి అని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. ఈ పవిత్రమైన రోజును పురస్కరించుకుని తెలంగాణ ప్రజలకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. మహాశివరాత్రిని భక్తులు పండగలా నిర్వహించుకుంటారని అన్నారు. శివరాత్రి రోజు రాత్రి జాగరణ చేస్తూ భక్తులు భగవంతుడిని ఆరాధించడం వల్ల ఎన్నో మంచి ఫలితాలు కలుగు తాయని అన్నారు. శివ భక్తులకు ఇది ఎంతో ముఖ్యమైన పండగ అని అన్నారు. ఈ పండగ నేపధ్యంలో మంచి ఆలోచనలు, ప్రేమాభిమానాలతో ప్రజలు జరుపుకోవాలన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పండగను ఘనంగా జరుపుకోవాలని సూచించారు.
మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్