బాధలను రెప్ప కింద
వేసి తొక్కేస్తున్నా
శుభోదయం కోసం
ఎదురు చూపులతో...
తపనం
బాధలను రెప్ప కింద
వేసి తొక్కేస్తున్నా
శుభోదయం కోసం
ఎదురు చూపులతో...
ఆశలు పిడికిలిలో
వేసి నొక్కేస్తున్నా
మారని రాత కోసం
ఊపిరి ఊహలతో....
భావ సంపుటాలలో
అక్షరాలతో కప్పేస్తున్నా
బరువెక్కిన హృదయాన్ని
తేలిక చేసుకోడానికి...
దారి చూపే
వెలుగు రేఖలా...
ఓదార్పు నిచ్చే
ప్రేమ లేఖలా...
ప్రణయమై విచ్చే
నిశి రేయిలా
కష్ట సుఖాలు
కాలంతో తరిగిపోతుంటే
తపనం తీరేదెన్నడో
రచన
డా!! బాలాజీ దీక్షితులు పి.వి
తిరుపతి
8885391722