ఆర్మూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్నా ను చితకబాదిన మైనార్టీ వర్గ ప్రజలు:


ఆర్మూర్ టౌన్ ఫిబ్రవరి8(జనంసాక్షి)
ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ ప్రాంతంలో మంగళవారం ఉదయం స్థానికుల ప్రజల అభిప్రాయాల మేరకు డ్రైనేజీ సమస్యలు తీర్చాలని ఆర్మూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ ము న్ను భాయ్ వెళ్లి కలవడం జరిగింది ఆయన వెంటనే స్పందించి సమస్య పరిష్కారం కొరకు డ్రైనేజీ మరమ్మతులుచూడడానికి వెళ్లిన క్రమంలో వైస్ ఛైర్మన్ మున్ను పై సత్తార్ చెయ్యి కోవడం జరిగింది.ఆ విషయంపై స్థానిక ఆర్మూర్ పోలీసులు గతంలో సత్తార్ పై కేసు నమోదు చేశారు ఇప్పుడు అంతకు మించి ప్రజా ప్రతినిధి ప్రముఖ ఆర్మూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ మున్ను భాయ్ పై చెయి చేసుకొనడం స్థానిక ప్రజలలో ఈ సంఘటన ఆశ్చర్యానికి గురిచేస్తోంది.ఈ సంఘటన తెలిసిన వెంటనే ఆర్మూర్ మున్సిపల్ కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు ఆర్మూర్ పోలీస్ స్టేషన్ లో సత్తార్ పై ఫిర్యాదు చేశారు. ఆర్మూర్ పోలీసులు రంగంలోకి దిగి సత్తార్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది వెంటనే స్థానిక ఎస్ ఐ లు ఇరువర్గాల వారిని సముదాయించి బాధితులు అయినటువంటి మున్ను భాయ్ ను ఆర్మూర్ ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం పంపించారు