భ్రష్టుపట్టిన తెలంగాణ విద్యావిధానం

డిఎస్సీ నియామకాలు లేవు...కెజి టూ పిజి లేదు

విూడియా సమావేశంలో మండిపడ్డ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి
జగగిత్యాల,  ( జనం సాక్షి):  తెలంగాణ ప్రభుత్వం విద్యావిధానంలో పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి విమర్శించారు. డిఎస్సీలు లేవు..కెజి టూ పిజి లేదు..ఫీజులపై నియంత్రణ లేదు అంటూ విమర్శలు గుప్పించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని తన నివాసంలో విూడియాతో మాట్లాడిన ఆయన.. గడిచిన ఎనిమిది సంవత్సరాలలో రాష్ట్ర ప్రభుత్వం విద్యావిధానంలో పూర్తిగా విఫలమైందన్నారు.. కేసీఆర్‌ కేజీ టు పీజీ ఉచిత విద్య హావిూ ఏమైందని ప్రశ్నించారు.. రాష్ట్రప్రభుత్వం ప్రభుత్వ విద్యాలయాలను నిర్విర్యం చేస్తూ ప్రైవేట్‌ విద్యావ్యవస్థను ప్రోత్సహిస్తుందని ఆరోపించిన ఆయన.. రాబోయే విద్యాసంవత్సరం నుండి ప్రభుత్వం పాఠశాలల్లో ఆంగ్ల పాఠశాలలు బలోపేతం అవుతాయిని కేసీఆర్‌ ప్రకటించారు.. కానీ, సరైన వసతులే లేవన్నారు. మన ఊరు`మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు ఉద్యోగ నియామకాలు చెప్పట్టాలని జీవన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధనను మెరుగుపరచడానికి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ నియామకాలను వెంటనే పూర్తి చేయాలన్నారు. మన ఊరు మన బడి కార్యక్రమన్ని స్వాగతిస్తున్నాను.. వచ్చే విద్యాసంవత్సరంలోపు టీచర్‌ ఎలిజిబుల్‌ పరీక్ష నిర్వహించాలని కోరారు. విద్యా వ్యవస్థలో పార్ట్‌ టైం స్వీపర్‌ లను తొలగించారని.. రాష్ట్రంలో ఉన్న 30 వేల ప్రభుత్వ పాఠశాలల్లో కాంట్రాక్ట్‌ పద్ధతిన స్వీపర్స్‌ ను నియమించాలని డిమాండ్‌ చేశారు.. ఇక, మధ్యాహ్న భోజన కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం ధర్నాలు చేసిన ఆదుకోలేదని ఫైర్‌ అయ్యారు.