మహిళలకు నచ్చిన దుస్తులు ధరించే హక్కు ఉంది..


` వారిని వేధించడం ఆపండి..!
` కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ
దిల్లీ,ఫిబ్రవరి 9(జనంసాక్షి): కర్ణాటకను కుదిపేస్తోన్న హిజాబ్‌ వివాదంపై బుధవారం కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ స్పందించారు. తరగతి గదుల్లో హిజాబ్‌ ధరించే విషయంలో ఆమె విద్యార్థినులకు మద్దతుగా ట్వీట్‌ చేశారు. దుస్తుల ఎంపిక మహిళల ఇష్టమని, ఇది రాజ్యాంగ పరమైన హక్కు అని స్పష్టం చేశారు.‘ఏ దుస్తులు ధరించాలో నిర్ణయించుకునే హక్కు మహిళలకు ఉంది. ఇది రాజ్యాంగం హవిూ ఇచ్చిన హక్కు. మహిళలను వేధించకండి’ అంటూ ప్రియాంక ట్వీట్‌ చేశారు. అలాగే శ్రీజీటసతిష్ట్రనీనీనిశ్రీజీటబజీసబితిష్ట్రనీనీని అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడిరచారు. మహిళలు పోరాడగలరనేది దీనర్థం. ఈ నినాదంతో ఆమె యూపీ అసెంబ్లీ ఎన్నికల వేళ మహిళా ఓటర్లను ఆకర్షించే విధంగా ప్రచారం నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. హిజాబ్‌ వివాదంపై ప్రియాంక చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ట్విటర్‌ వేదికగా మద్దతు పలికారు. దక్షిణాది రాష్ట్రం కర్ణాటకలో మంగళవారం హిజాబ్‌ వివాదం తీవ్రరూపం దాల్చింది. వస్త్రధారణపై రెండు వర్గాల విద్యార్థుల మధ్య ఘర్షణలు చోటుచేసుకోవడంతో ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. దాంతో అక్కడి ప్రభుత్వం మూడు రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది.