డిస్కమ్‌లకు చెల్లింపుల్లో నిర్లక్ష్యం
60వేల కోట్లకు చేరిన డిస్కమ్‌ల అప్పులువిూడియా సమావేశంలో పిసిసి చీఫ్ రేవంత్
హైదరాబాద్,ఫిబ్రవరి25 (జనంసాక్షి):డిస్కంల అప్పులు రూ.60 వేల కోట్లకు చేరాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. దీనికి ప్రభుత్వ బాధ్యతా రాహిత్యమే కారణమని అన్నారు. విద్యుత్ సంస్థ వైఫల్యానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా కారణమని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం కూడా
ఒక వినియోగదారు అనే అంశాన్నే మర్చిపోతున్నారని, ప్రభుత్వాల నుంచి బకాయిలు రాబట్టకపోవడంతో డిస్కంలు అప్పుల పాలు చేశారని విమర్శించారు. ప్రభుత్వం ప్రకటించిన రాయితీలు, పథకాలపై ఛార్జీలను డిస్కంలకు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏటా డిస్కంలకు ప్రభుత్వం రూ.16 వేల కోట్లు చెల్లించాలని అన్నారు. ప్రభుత్వం ఏటా రూ.6 వేల కోట్లు మాత్రమే చెల్లిస్తోందని, డిస్కంలకు ప్రధాన డిఫాల్టర్ రాష్ట్ర ప్రభుత్వమేనని తప్పుబట్టారు. విద్యుత్ పంపిణీ సంస్థల చార్జీల పెంపు ప్రతిపాదనలను చర్చకు తావు లేకుండా ఈఆర్సీ తిరస్కరించాలనిరేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత డిస్కామ్‌ల, ట్రాన్స్క్ లలో ఈఆర్సీ నిర్వహణలో లోపాలు ఉన్నాయన్నారు. రాష్ట్ర విభజన సమయంలో విద్యుత్ పంపిణీ సంస్థల అప్పులు 11 వేల కోట్లు ఉంటే.. 8 వేల 9 వందల కోట్ల అప్పు భారం ను కేంద్రం తీసుకుందని ఆయన వెల్లడిరచారు. ఉదయ్ స్కీమ్‌లో చేరడంతో డిస్కామ్ ల అప్పు 2 వేల కోట్లకు చేరుకుందన్నారు. ఇవాళ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థల అప్పులు 60 వేల కోట్లకు చేరుకుందని ఆయన అన్నారు. డిస్కామ్ లు రాష్ట్రంలో దివాళా తీసాయి? రాష్ట్ర ప్రభుత్వం నుంచి బకాయిలు రాబట్టుకోకపోవడమే ఇందుకు కారణమని ఆయన మండిపడ్డారు. విద్యుత్ పంపిణీ చేస్తున్న కరెంటులో 30 శాతం వినియోగదారు రాష్ట్ర సర్కార్ అని ఆయన అన్నారు. ఏడాదికి డిస్కామ్ లకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన 16 వేల కోట్లలో సర్కార్ కేవలం 5 వేల 6 వందల కోట్లు మాత్రమే ఇస్తుందని ఆయన తెలిపారు.