విద్యుత్‌ సమస్యకు చెక్‌ పెట్టిన తొలి సిఎం

 


నిరంతర విద్యుత్‌తో సమస్యలు దూరం
మారుతున్న వ్యవసాయ ముఖచిత్రం
హైదరాబాద్‌,ఫిబ్రవరి17(జనంసాక్షి): నిరంతర విద్యుత్‌..కల కాదని తెలంగాణలో సిఎం కెసిఆర్‌ నిరూపించారు. కరెంట్‌ పోతే వార్త అన్న వాదన పైకి తీసుకుని వచ్చారు. టైమ్‌ చూసుకుని వంటింట్లోకి వెళ్లే ఆగత్యం లేకుండా చేశారు. అలాగే కరెంట్‌ లేక జిరాక్స్‌ సెంటర్లు మూతపడ్డ ఘటనలు మాయమయ్యాయి. లాంతర్లు పట్టి నిరసనలు తెలిపే రోజులు పోయాయి. ఇందిరాపార్క్‌ వద్ద పారిశ్రామిక వేత్లల నిరసనలు లేవు. ఇలా చెప్పుకుంటూ పోతే కరెంట్‌ కథలు ఎన్నో ఉన్నాయి. తెలంగాణలో రైతే రాజు కావాలి.. తెలంగాణ రైతు రాజ్యం కావాలి! వ్యవసాయం చేయడం ఉత్సవంలా సాగాలి! రాష్ట్ర గ్రావిూణ ఆర్థిక వ్యవస్థ ముఖచిత్రం సమగ్రంగా మారిపోవాలి.. అంతిమంగా బంగారు తెలంగాణ నిర్మాణం కావాలి! ఇది ఒక రాజకీయ పార్టీ సంకల్పంగా మాత్రమే చూడరాదు. దార్శనికుడైన నేత నాయకత్వంలో తీసుకున్న ప్రభుత్వ ఆలోచనగా చూడాలి. తన తపనంతా రాష్టాభ్రివృద్ధి కోసమేనని చాటిన సిఎం కెసిఆర్‌ రైతుల రక్షణ తన లక్ష్యమని ప్రకటించారు. కాలుష్యకారక పరిశ్రమలకు ఇచ్చే ప్రోత్సాహంలో కనీసం పైసావంతు రైతుకోసం ఖర్చు పెడితే పక్కాగా, ప్రణాళికా బద్దంగా ముందుకు సాగితే దేశం బలడడమే గాకుండా ప్రపంచానికే పట్టెడన్నం పెట్టగలదు. తెలంగాణ ఏర్పడ్డ తరవాత కోటి ఎకరాల మాగాణంగా మార్చాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి కెసిఆర్‌ మదిలో రైతులకు సంబంధించిన పటిష్టమైన ఆలోచనలు రావడం స్వాగతించాలి. విద్యుత్‌ సమస్యను అధిగమించిన తెలంగాణలో ఇటీవలే రైతులకు రెండు కార్లకు పెట్టుబడి అందిస్తామని సిఎం కెసిఆర్‌ ప్రకటన చేసి అమలు చేశారు. నిజంగానా రైతు కుటుంబాల్లో ఆశలు నింపింది. వట్టిపోయిన తెలంగాణలో వ్యవసాయాన్ని లాభదాయకం చేయడం అంత ఆషామాషీ కాదు. నదులు జీవం కోల్పోయాయి. చెరువులు ఆనవాళ్లు లేకుండా చేశారు. విద్యుత్‌ అందకుండా చేశారు. ఈ దశలో తెలంగాణ ఏర్పడ్డ ఏడున్నరేళ్లలో అద్భుతాలు రావాలని కోరుకోవడం అత్యాశే అవుతుంది. అయినా అడుగులు పడ్డాయి. రైతులకు కరెంట్‌ అందుతోంది. చెరువుల పూడికతీత ముమ్మరంగా సాగుతోంది. దీంతో చెరువుల్లో నీరుచేరి ఊళ్ళు కళకళలాడుతున్నాయి. ఇక ప్రాజెక్టుల పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇఅయినా వీటితోనే రైతులు బాగు పడ్డాయని ఎవరూ అనడం లేదు. అలాగే పాలకుడైన
సిఎం కెసిఆర్‌ కూడా అనడం లేదు. నిజాయితీగానే వ్యవసాయాన్ని పండగ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామనే చెబుతున్నారు. రైతును నష్టాల ఊబిలోంచి లాగడమంటే రాష్టాన్న్రి ఆర్థికంగా బలోపేతం చేయడం అన్నది కెసిఆర్‌కు తెలియంది కాదు. నిజంగా కెసిఆర్‌ ప్రకటించిన విధానాలు వ్యవసాయాన్ని బలోపేతం చేస్తాయనడంలో సందేహం లేదు. గ్రావిూణ ఆర్థిక వ్యవస్థ సమగ్రాభివృద్ధి లక్ష్యంగా చేసిన ఆలోచనగా భావించాలి. కల్తీ విత్తనాలు అమ్మేవారిపై ఉక్కుపాదం మోపుతామని ప్రకటించారు. రైతులకు జరిగిన నష్టాన్ని కంపెనీలే చెల్లించేలా చట్టం తెస్తామన్నారు. ఇంతకంటే రైతు మరేం కోరుకుంటాడు.
పాలకులు ఏదైనా పథక రచన చేస్తే దానిని అమలు చేయించుకునే బాధ్యత విపక్షాలపైనా ఉంటుంది. విమర్శలకే ప్రతిపక్షాలు పరిమితం కారాదు. ఉపాధి హావిూ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం
చేయాలని కోరుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదు. రైతుల్ని సంఘటితం చేసి, అవసరమైన పంటలను పండిరచే క్రమంలో కూడా ఆలోచనలుచేస్తున్నారు. తెలంగాణను పంటల కాలనీలుగా విభజించి,ఇకపై ఏ జిల్లాలో ఏ పంటలు వేయాలో నిర్ణయిస్తామన్న ప్రకటనవల్ల అందరూ ఒకే రకమైన పంటలు వేసి నష్టపోకుండా చూడడం జరుగుతుంది.