ఎప్రిల్‌లో అంబేడ్కర్ ఓపెన్ పరీక్షలు
హైదరాబాద్,ఫిబ్రవరి24(జనంసాక్షి ): డా.బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ మొదట, మూడో, ఐదో సెమిస్టర్ పరీక్షలు ఏప్రిల్,మేలో నిర్వహించనున్నట్టు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ రెండో సంవత్సరం మూడో సెమిస్టర్ ఎగ్జామ్స్ ఏప్రిల్ 17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు, మూడో సంవత్సరం ఐదో సెమిస్టర్ ఎగ్జామ్స్ ఏప్రిల్ 25వ తేదీ నుంచి 30వ తేదీ వరకు, అలాగే మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ ఎగ్జామ్స్ మే 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరుగుతాయని అధికారులు తెలిపారు.ఆన్ లైన్ లో రిజిస్టేష్రన్ చివరి తేదీ మార్చ్ 20వ తేదీగా పేర్కొన్నారు. ఎగ్జామ్ సమయం మధ్యాహ్నం 2గంటల నుంచి 5గంటల వరకు జరుగుతాయి. ఎగ్జామ్ కు హాజరు కాగోరు విద్యార్ధులు యూనివర్శిటీ పోర్టల్ లో నమోదుచేసుకోవాలి. అనంతరం ఫీజును టీఎస్, ఏపీ ఆన్ లైన్ సెంటర్ల ద్వారా లేదా డెబిట్, క్రెడిట్ కార్డ్ తో మాత్రమే చెల్లించాలని అధికారులు సూచించారు. మరిన్ని వివరాలకు అభ్యర్ధులు వారి సంబంధిత అధ్యయనకేంద్రంలో సంప్రదించాలని అధికారులు తెలిపారు.