ఎల్లారెడ్డి 21ఫిబ్రవరి జనంసాక్షి (టౌన్)
ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని లింగరెడ్డిపెట్ లో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సోమవారం నాడు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి మొట్టమొదట తల్లిదండ్రుల ద్వారా నేర్చుకొనే మాటలే మాతృభాష అని ప్రతి విద్యార్థి ఎంత గొప్ప ఉన్నత చదువులను ఏ భాష లో చదివినప్పటికి మాతృభాష ను మర్చి పోలేరని మాతృభాష గొప్పతనాన్ని వివరించారు ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మెన్ బాలయ్య, ప్రధాన ఉపాధ్యాయులు విశ్వనాథం, ఉపాధ్యాయురాలు ఉమాదేవి లతో పాటు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు